మీరు ఫ్యూచ‌ర్ ఆఫ్ ఇండియా.. ల‌వ్ యూ KCR: బండ్ల గ‌ణేశ్

విధాత‌: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆరే ఈ దేశానికి భ‌విష్య‌త్‌.. మీరు అద్భుతం.. ల‌వ్ యు కేసీఆర్ అంటూ ప్ర‌ముఖ నిర్మాత బండ్ల గ‌ణేశ్ వ‌రుస ట్వీట్లు చేశారు. కేసీఆర్ ప‌రిపాల‌న‌పై గ‌ణేశ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఏ స్వార్థం కోసమో.. ఏ లబ్ధి కోసమో మీ దగ్గర ఏది ఆశించో నేను చెప్పట్లేదు. నరసింహస్వామిని చూసిన తర్వాత ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు మీపై ఉండాలని, ఎల్లవేళలా ఆ స్వామివారి ఆశీస్సులు మీ మీద ఉండాలని మా […]

మీరు ఫ్యూచ‌ర్ ఆఫ్ ఇండియా.. ల‌వ్ యూ KCR: బండ్ల గ‌ణేశ్

విధాత‌: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆరే ఈ దేశానికి భ‌విష్య‌త్‌.. మీరు అద్భుతం.. ల‌వ్ యు కేసీఆర్ అంటూ ప్ర‌ముఖ నిర్మాత బండ్ల గ‌ణేశ్ వ‌రుస ట్వీట్లు చేశారు. కేసీఆర్ ప‌రిపాల‌న‌పై గ‌ణేశ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఏ స్వార్థం కోసమో.. ఏ లబ్ధి కోసమో మీ దగ్గర ఏది ఆశించో నేను చెప్పట్లేదు.

నా మనసులోని మాటలు చెప్తున్నాను. మంచి చేస్తే మంచి అని చెప్తాను, లేకపోతే మౌనంగా ఉంటాను. అది నా నైజం సార్..! మీరు అద్భుతం, యువర్ ఏ వండర్ ఫుల్, యువర్ ఫీచర్ ఆఫ్ ఇండియా.. లవ్ యు కేసీఆర్ గారు అంటూ బండ్ల గ‌ణేశ్ త‌న ట్వీట్ల‌లో పేర్కొన్నారు.

ఎన్నో రోజుల నుంచి శ్రీ ల‌క్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవాలని కోరిక ఉన్నా.. ఆ స్వామివారి అనుగ్రహం లేక నాకు రావటం కుదరలేదు. కానీ ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా వచ్చి ఆ యాదగిరి నరసింహ స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ ఆలయాన్ని భూతల స్వర్గంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి కేసీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక కతజ్ఞతలు.