YuvaGalam Padayatra | యువగళానికి జనం బ్రహ్మరథం.. పోటెత్తిన ప్రకాశం బ్యారేజి
YuvaGalam Padayatra | విధాత: ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిన టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు స్వాగతం పలికేందుకు తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలతో ప్రకాశం బ్యారేజీ క్రిక్కిరిసింది. లోకేశ్ యువగళం పాదయాత్రకు ప్రకాశం బ్యారేజీ వద్ద ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు, పార్టీ శ్రేణులు వీడ్కోలు పలికారు. మరోవైపు యాత్రకు స్వాగతం పలికేందుకు పసుపు, ఎరుపురంగు బెలూన్లతో ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో […]

YuvaGalam Padayatra |
విధాత: ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిన టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు స్వాగతం పలికేందుకు తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలతో ప్రకాశం బ్యారేజీ క్రిక్కిరిసింది. లోకేశ్ యువగళం పాదయాత్రకు ప్రకాశం బ్యారేజీ వద్ద ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు, పార్టీ శ్రేణులు వీడ్కోలు పలికారు.
మరోవైపు యాత్రకు స్వాగతం పలికేందుకు పసుపు, ఎరుపురంగు బెలూన్లతో ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇరువైపుల తరలివచ్చిన రెండు జిల్లాల పార్టీ శ్రేణులు, జనంతో ప్రకాశం బ్యారేజీ పరిసరాలు జన సంద్రంగా మారాయి.
బెజవాడలో దేశం మీసం మెలేసింది