Life style | మీకు శృంగారంపై ఆసక్తి సన్నగిల్లిందా.. ఈ ఫుడ్స్ తీసుకుంటే కోరికలు గుర్రాలైతాయ్..!
Life style : శృంగారం అనేది ఆలుమగల (Couple) మధ్య అయస్కాంత ఒక శక్తి లాంటిది. ఆలుమగలిద్దరూ శృంగారంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. అయితే వయసు పెరిగినా కొద్ది శృంగార వాంఛ తగ్గిపోతుంది. అది అందరిలో ఉండే సాధారణ సమస్యే. వయసు మీరిన తర్వాత శృంగార కోరికలు ఇద్దరిలోనూ తక్కువగానే ఉంటాయి. కానీ కొంతమందిలో మాంచి వయసులో ఉండగానే శృంగారంపై ఆసక్తి సన్నగిల్లుతుంది.

Life style : శృంగారం అనేది ఆలుమగల (Couple) మధ్య అయస్కాంత ఒక శక్తి లాంటిది. ఆలుమగలిద్దరూ శృంగారంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. అయితే వయసు పెరిగినా కొద్ది శృంగార వాంఛ తగ్గిపోతుంది. అది అందరిలో ఉండే సాధారణ సమస్యే. వయసు మీరిన తర్వాత శృంగార కోరికలు ఇద్దరిలోనూ తక్కువగానే ఉంటాయి. కానీ కొంతమందిలో మాంచి వయసులో ఉండగానే శృంగారంపై ఆసక్తి సన్నగిల్లుతుంది. అంటే ఆయస్కాంత శక్తి నశించిపోతుంది. దీనివల్ల ఆలుమగల మధ్య సఖ్యత దెబ్బతింటుంది. దాంతో బంధం బలహీనపడుతుంది.
వయసు మళ్లిన వారిలో శృంగార కోరికలు తగ్గడానికి వయసే కారణమైతే, వయసులో ఉన్నవారిలో శృంగార కోరికలు తగ్గడానికి జీవనవిధానంలో మార్పులు, మితిమీరిన శారీరక శ్రమ (Physical), అలసట, మానసిక ఒత్తిడి (Mental stress) లాంటివి కారణాలుగా చెప్పవచ్చు. వృద్ధుల్లో శృంగార వాంఛ తగ్గడం సాధారణం కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ యుక్త వయస్కులు మాత్రం ఇలాంటి సమస్య నుంచి బయటపడాల్సిందే. కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు. సన్నగిల్లిన కోరికలను గుర్రాల్లా పరుగెత్తించవచ్చు. మరి ఆ పదార్థాలేవో తెలుసుకుందాం..
నత్తలు
అడుగంటిన శృంగార కోరికలను తట్టిలేపడంలో నత్తగుల్లలు (Snails) బాగా పనిచేస్తాయి. నత్తల్లో జింక్ సమృద్ధిగా ఉంటుంది. ఈ జింక్.. టెస్టోస్టిరాన్ అనే లైంగిక హార్మోన్ స్థాయిలను నియంత్రించడంలో, నరాల్లో రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చడంలో తోడ్పడుతుంది. కాబట్టి నత్తలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి.
సాల్మన్ చేప
సాల్మన్ చేపలు (Salman fishes) కూడా శృంగార వాంఛలు పెరుగడానికి తోడ్పడుతాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలతోపాటు, ఇతర విటమిన్‌లు ఉంటాయి. ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చి శృంగార కోరికలను పెంచుతాయి.
అవకాడోలు
శృంగార కోరికలను పెంచడమేగాకుండా, అంగస్తంభన లోపాలను సరిచేయడంలో అవకాడోలు (Avocadoes) బాగా పనిచేస్తాయి. రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించి రక్త ప్రవాహం మెరుగుపడేలా చేయడంలో కూడా ఇవి తోడ్పడుతాయి.
ఇవి కూడా..
పైన పేర్కొన్నవేగాక జింక్ ఎక్కువగా ఉండే రెడ్‌మీట్, ఉడికించిన బీన్స్, పాలు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, బాదం గింజలు, చిరు ధాన్యాలను తరచూ తీసుకోవడంవల్ల రక్త ప్రసరణ బాగా జరిగి శృంగార కోరికలు పెరుగుతాయి. అదేవిధంగా సిట్రస్ జాతి పండ్లు, ఆపిల్స్, బెర్రీస్, గ్రేప్స్, రెడ్ వైన్, టీ, డార్క్ చాక్లెట్స్ కూడా నరాల్లో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. వీటితోపాటు నైట్రేట్స్ అధికంగా ఉండే పాలకూర, తోటకూర తదితర ఆకు కూరలు, ముల్లంగి, మునగ కాయలు లాంటివి కూడా శృంగార వాంఛలను రేకెత్తిస