Anganwadi Teacher | 58 ఏండ్ల వ‌య‌సులో ఇంట‌ర్ పాసైన అంగ‌న్‌వాడీ టీచ‌ర్

Anganwadi Teacher | దృఢ సంక‌ల్పం, ప‌ట్టుద‌ల ఉంటే ఏదైనా సాధించొచ్చు. అందుకు ఉదాహ‌ర‌ణే ఈ అంగ‌న్‌వాడీ టీచ‌ర్( Anganwadi Teacher   ). ఆ అంగ‌న్‌వాడీ టీచ‌ర్ 58 ఏండ్ల వ‌య‌సులో ఇంట‌ర్( Inter ) పాసై నేటి యువ‌త‌( Youth )కు ఆద‌ర్శంగా నిలిచింది.

Anganwadi Teacher | 58 ఏండ్ల వ‌య‌సులో ఇంట‌ర్ పాసైన అంగ‌న్‌వాడీ టీచ‌ర్

Anganwadi Teacher | మ‌హారాష్ట్ర‌( Maharashtra )లోని స‌తార జ‌వాలి తాలుకాలోని కుడాల్( Kudal ) గ్రామానికి చెందిన సువ‌ర్ణ వినాయ‌క్ ప‌వార్( Suvarna Vinayak Pawar ) వృత్తిరీత్యా అంగ‌న్‌వాడీ టీచ‌ర్( Anganwadi Teacher  ). ఆమెకు 19 ఏండ్ల వ‌య‌సులోనే పెళ్లైంది. సంసార బాధ్య‌త‌ల్లో మునిగిపోయిన ఆవిడ త‌న చ‌దువును కొన‌సాగించ‌లేకపోయింది. ఇక ప‌ది అర్హ‌త‌తో అంగ‌న్‌వాడీ హెల్ప‌ర్‌( Anganwadi Helper )గా చేరింది. ఆ త‌ర్వాత 2010లో అంగ‌న్‌వాడీ టీచ‌ర్‌గా ఆమెకు ప‌దోన్నతి ల‌భించింది. ప‌దో త‌ర‌గ‌తి( Tenth Class )తోనే చ‌దువును ఆపేసిన ఆమెకు చ‌ద‌వాల‌నే కోరిక పుట్టింది. దీంతో భ‌ర్త‌, పిల్ల‌ల స‌హ‌కారంతో 58 ఏండ్ల వ‌య‌సులో ఇంట‌ర్( Inter ) పాసై నేటి యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలిచింది. 50.83 శాతంతో ఇంట‌ర్‌లో ఉత్తీర్ణ‌త సాధించింది.

సువ‌ర్ణ‌కు భర్త‌, ఇద్ద‌రు కుమారులు, కూతురు ఉన్నారు. కుమారులు, కూతురికి పెళ్లిళ్లు అయ్యాయి. అయితే త‌న కోడ‌ళ్ల‌ను కూడా ఆమె చదువుకోవాల‌ని ప్రోత్స‌హిస్తుంది. దీంతో ఒక కోడ‌లు సివిల్ ఇంజినీరింగ్ చ‌దువుతుంది. మ‌రో కోడ‌లు అంగ‌న్‌వాడీలోనే ప‌ని చేస్తుంది.

ఇంట‌ర్‌లో పాసవ్వ‌డం వెనుకాల నా భ‌ర్త‌, పిల్ల‌ల కృషి ఉంద‌ని సువ‌ర్ణ భావోద్వేగంతో చెప్పింది. వారి స‌హ‌కారం వ‌ల్లే ఇంట‌ర్ పాస‌య్యాన‌ని పేర్కొంది. త‌న చదువుకు ఎలాంటి ఆటంకం క‌లిగించ‌కుండ‌గా కుమారులు, కోడ‌ళ్లు ఎంతో స‌హ‌క‌రించార‌ని తెలిపింది. సువ‌ర్ణ ఇంట‌ర్ పాస్ కావ‌డంతో తోటి అంగ‌న్ వాడీ టీచ‌ర్లు, స్థానిక నాయ‌కులు, కుటుంబ స‌భ్యులు ఆమెకు శుభాకాంక్ష‌లు తెలిపారు.