దసరా పండగ.. బ్యాంకులకు నాలుగురోజులు సెలవులు..!

దసరా పండగ.. బ్యాంకులకు నాలుగురోజులు సెలవులు..!

విధాత‌: ప్రస్తుతం దసరా సీజన్‌ కొనసాగుతున్నది. దీంతో పలు రాష్ట్రాల్లో లాంగ్‌ వీకెండ్‌ ఉండబోతున్నది. దీంతో నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ నెలలో బ్యాంకులకు దాదాపు 16 రోజుల పాటు సెలవులు వచ్చాయి. అయితే, బుధవారం (18వ తేదీ) నుంచి 31వ తేదీ వరకు కటి బిహు, దుర్గాపూజ, దసరా, లక్ష్మీ పూజతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి.


అయితే, దసరా నేపథ్యంలో త్రిపుర, అసోం, పశ్చిమ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు అంటే 21 నుంచి 24 వరకు బ్యాంకులకు తాళాలుపడనున్నాయి. 21న దుర్గాపూజ, 22, 23 తేదీల్లో విజయ దశమి, 24న దుర్గాపూజ జరుగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో సెలవులు మారనున్నాయి. అలాగే 25 నుంచి 28 తేదీల్లో సిక్కింలో బ్యాంకులు మూతపడనున్నాయి. దుర్గాపూజ సందర్భంగా 25, 26, 27 తేదీల్లో ఇక్కడ బ్యాంకులు మూసే ఉంటాయి. 28న లక్ష్మీపూజ సందర్భంగా సెలవులు ఇచ్చారు.


కర్నాటక, ఒడిశా, కేరళ, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్‌లో అక్టోబర్ 22, 23, 24 తేదీల్లో బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇక దుర్గాష్టమి సందర్భంగా 22న, 22న దుర్గాష్టమి, అక్టోబర్ 23న దసరా సందర్భంగా బ్యాంకుల్లో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అలాగే 28, 29 తేదీల్లోనూ మూతపడనున్నాయి. అయితే, బ్యాంకులు మూతపడినా మొబైల్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.