Geniben Thakor | ఆమె గెలుపుతో గుజరాత్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్‌కు బ్రేక్‌.. ఎవ‌రీ జెనిబెన్..?

Geniben Thakor | 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గుజ‌రాత్‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ క్లీన్‌స్వీప్‌కు బ్రేక్ ప‌డింది. మొత్తం 26 స్థానాలు ఉన్న గుజ‌రాత్‌లో బీజేపీ 25 స్థానాల్లో గెలుపొందింది. మిగిలిన ఒక స్థానాన్ని హ‌స్తం పార్టీ కైవ‌సం చేసుకుంది. దీంతో గుజ‌రాత్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్‌కు కాంగ్రెస్ పార్టీ గండికొట్టింది. ప‌దేండ్ల త‌ర్వాత గుజ‌రాత్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.

గుజ‌రాత్‌లోని బ‌న‌స్కాంత నియోజ‌క‌వ‌ర్గం బీజేపీకి కంచుకోట‌. 2014, 2019 ఎన్నిక‌ల్లోనూ బీజేపీ అఖండ విజ‌యం సాధించింది. 2024 ఎన్నిక‌ల్లో మాత్రం కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసిన జెనిబెన్ నాగాజీ ఠాకూర్ 30,406 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. త‌న స‌మీప బీజేపీ ప్ర‌త్య‌ర్థి రేఖా చౌద‌రిని ఠాకూర్ ఓడించారు. దీంతో 2014, 2019 ఎన్నికల మాదిరిగా మూడోసారి మొత్తం 26 స్థానాలను తన ఖాతాలో వేసుకోవాలన్న బీజేపీ లక్ష్యానికి కాంగ్రెస్ పార్టీ గండి కొట్టింది. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పార్బాత్‌భాయి పటేల్‌.. తన సమీప కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పార్థీ భాటోల్ మీద 3.68 లక్షల మెజారిటీతో విజయం సాధించారు.

ఎవ‌రీ జెనిబెన్..?

జెనిబెన్ ఠాకూర్ వావ్ నియోజ‌క‌వ‌ర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే. అయితే ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ బ‌న‌స్కాంత నుంచి లోక్‌స‌భ‌కు పోటీలో నిల‌బెట్టింది. 2012 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమె బీజేపీ చేతిలో ఓడిపోయారు. 2017, 2022 ఎన్నిక‌ల్లో వావ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జెనిబెన్ గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2017 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నాటి గుజ‌రాత్ స్పీక‌ర్‌ను ఓడించ‌డంతో ఆమెను జెయింట్ కిల్ల‌ర్‌గా పిలుస్తారు.