Arvind Kejriwal | నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రత్యేక అధికారాలకు కోతే.. కేజ్రీవాల్ కు జైలు అధికారుల హెచ్చరిక..!
Arvind Kejriwal | లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాయడం జైలు నిబంధనలను ప్రకారం.. అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని తీహార్ జైలు అధికారులు పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున తనకు బదులుగా కేబినెట్ మంత్రి అతిషి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారంటూ ఎల్జీకి కేజ్రీవాల్ లేఖ రాసిన విషయం తెలిసిందే.

Arvind Kejriwal | లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాయడం జైలు నిబంధనలను ప్రకారం.. అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని తీహార్ జైలు అధికారులు పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున తనకు బదులుగా కేబినెట్ మంత్రి అతిషి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారంటూ ఎల్జీకి కేజ్రీవాల్ లేఖ రాసిన విషయం తెలిసిందే. తీహార్ జైలు నం.2 సూపరింటెండెంట్ ఢిల్లీ జైలు నియమాలు, 2018లోని నిబంధనలను ఉదహరించారు. కేజ్రీవాల్ ఆమోదయోగ్యం కాని కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఫలితంగా ఆయన అధికారులు తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నారు. గత వారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాసిన లేఖలో, ఢిల్లీ ప్రభుత్వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో జాతీయ జెండాను ఎగురవేయాలని కేజ్రీవాల్ అతిషి జెండా ఎగురవేస్తారని తెలిపారు.
అయితే, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి లేఖను అందుకోలేదు. ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసులో కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నమోదు చేసిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేఇన విషయం తెలిసిందే. జైలు నిబంధనల ప్రకారం.. ఆయన రాసిన లేఖ ఆమోదయోగ్యం కాదని తీహార్ అధికారులు కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో తెలిపారు. నిబంధనల ప్రకారం.. ప్రైవేట్ కరస్పాండెన్స్ మాత్రమే ఆమోదయోగ్యమైందని.. అండర్ ట్రయల్ ఖైదీలు, హక్కులు, అధికారాలను పరిమితం చేసే ఢిల్లీ జైలు నియమాల చట్టపరమైన నిబంధనల నిర్వహించబడుతారన్నారు. ఆగస్టు 6న తాను సమర్పించిన లేఖలోని అంశాలను ఎలాంటి అధికారం లేకుండా మీడియాకు లీక్ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని లేఖలో అధికారులు పేర్కొన్నారు.