Hindus population | భారత్ లో హిందువులు తగ్గిపోయారు… జెట్ స్పీడ్ తో పెరిగిన ముస్లింలు

65 ఏళ్లలో 43శాతం పెరిగిన ముస్లిం జనాభా 7.82 శాతం తగ్గిన హిందూ జనాభా ప్రపంచవ్యాప్తంగా మెజార్టీ మతాల జనాభాలో తగ్గుదల ఖండాలవారీగానూ అదే ధోరణి ప్రధాని ఆర్థిక సలహా మండలి నివేదిక

Hindus population | భారత్ లో హిందువులు తగ్గిపోయారు… జెట్ స్పీడ్ తో పెరిగిన ముస్లింలు
  • 65 ఏళ్లలో 43శాతం పెరిగిన ముస్లిం జనాభా
  • 7.82 శాతం తగ్గిన హిందూ జనాభా
  • ప్రపంచవ్యాప్తంగా మెజార్టీ మతాల జనాభాలో తగ్గుదల
  • ఖండాలవారీగానూ అదే ధోరణి
  • ప్రధాని ఆర్థిక సలహా మండలి నివేదిక

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా మెజార్టీ మతాల జనాభా ఈ అరవై ఐదేళ్ల కాలంలో తగ్గినట్టు తమ అధ్యయనంలో తేలిందని ఆర్థిక సలహా మండలి తెలిపింది. ప్రతి ఖండంలోనూ ఇదే ధోరణి కనిపిస్తున్నదని పేర్కొన్నది. అధిక ఆదాయాలు ఉన్న 35 దేశాల్లో కూడా మెజార్టీ మత జనాభా 29 శాతం మేర తగ్గిందని పేర్కొన్నది. లోక్‌సభ ఎన్నికల్లో ముస్లింలు ఒక అంశంగా ఉన్న నేపథ్యంలో ప్రధాని ఆర్థిక సలహా మండలి ఒక నివేదికను విడుదల చేసింది. అందులో 1950 నుంచి 2015 వరకు హిందూ జనాభా 7.82 శాతం తగ్గిందని (84.68 శాతం నుంచి 78.06శాతానికి), అదే సమయంలో ముస్లిం జనాభా 9.84శాతం నుంచి 14.09 శాతానికి పెరిగిందని తెలిపింది. అంటే.. 43.15 శాతం పెరుగుదల ఉన్నదని పేర్కొన్నది. క్రైస్తవ జనాభా 2.24 శాతం నుంచి 2.36 శాతానికి పెరిగిందని తెలిపింది. సిక్కుల జనాభా 1950లో 1.24 శాతం నుంచి 2015 నాటికి 6.58 శాతానికి పెరిగిందని పేర్కొన్నది.

బౌద్ధుల జనాభా కూడా 0.05 శాతం నుంచి 0.81 శాతానికి పెరిగిందని తెలిపింది. మరోవైపు జైనుల జనాభా 0.45 శాతం నుంచి 0.36 శాతానికి తగ్గిందని పేర్కొన్నది. జనాభాలో మార్పులకు కారణాలేంటో చెప్పని సలహా మండలి నివేదిక.. మైనార్టీ మత జనాభా పెరుగుదల ఒక దేశ శ్రేయస్సుకు సంకేతమని తెలిపింది.