HIV Positive Man | ప్రతీకార చర్య.. ఆలయాలను దోచుకుంటున్న హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుడు..!
HIV Positive Man | దొంగలు( Thief ) ఎందుకు దోచుకుంటారు.. కష్టం తెలియకుండా.. విలాసవంతమైన జీవితం గడిపేందుకు. మూడో కంటికి కనపడకుండా ఆలయాలు( Temples ), నివాసాలను లక్ష్యంగా చేసుకుని దొంగలు దోపిడీలకు పాల్పడుతుంటారు. కానీ దొంగ మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు కాదట. దేవుడి( God )పై ప్రతీకారం( Revenge ) తీర్చుకునేందుకు దోపిడీలకు పాల్పడుతున్నాడట. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుడైన( HIV Positive Man ) ఈ దొంగ గురించి తెలుసుకోవాలంటే ఛత్తీస్‌గఢ్( Chhattisgarh ) వెళ్లాల్సిందే.

HIV Positive Man | ఛత్తీస్‌గఢ్( Chhattisgarh )లోని దుర్గ్ జిల్లా( Durg District )కు చెందిన ఓ 45 ఏండ్ల వ్యక్తి 2012లో ఓ దాడి కేసులో జైలు పాలయ్యాడు. ఇక జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఆ ఖైదీ హెచ్ఐవీ( HIV ) బారిన పడ్డాడు. అయితే ఆ దేవుడు( God ) తనను కనికరించలేదని, దేవుడి చర్య వల్లే తాను హెచ్ఐవీ బారిన పడ్డట్టు ఆ వ్యక్తి డిసైడ్ అయ్యాడు. ఇక జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రతీకార చర్యగా.. ఆలయాలను దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఇక పదేండ్ల కాలంలో దుర్గ్ జిల్లాతో పాటు ఆ ఏరియాలో ఉన్న ఆలయాలను దోచుకుంటూ ఉన్నాడు సదరు వ్యక్తి. అయితే ఈ ఏడాది ఆగస్టు 23, 24 తేదీల్లో దుర్గ్ జిల్లా శివార్లలో ఉన్న జైన ఆలయం( Jain Temple )లో దోపిడీకి పాల్పడ్డాడు హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుడు( HIV Positive Man ). సీసీటీవీ ఫుటేజీ ద్వారా అతన్ని గుర్తించి పట్టుకున్నారు పోలీసులు. నిందితుడి నుంచి రూ. 1,282 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఉపయోగిస్తున్న స్కూటర్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు.
దొంగతనానికి పాల్పడే ముందు ఆ ఆలయాన్ని ఒక్కసారి అతను సందర్శిస్తాడు. రెక్కీ నిర్వహించి మరుసటి రోజు దోపిడీకి పాల్పడుతాడు. ఇక తన స్కూటర్‌ను ఆలయానికి దూరంగా పార్కింగ్ చేసి, బట్టలు మార్చుకుంటాడు. దొంగతనం ముగిసిన తన తర్వాత మళ్లీ తన బట్టలు మార్చుకుని అక్కడ్నుంచి ఎస్కేప్ అవుతాడు అని పోలీసుల విచారణలో తేలింది. అయితే నిందితుడు కేవలం నగదు మాత్రమే దొంగిలిస్తాడు.. ఆలయంలో ఉన్న ఆభరణాల జోలికి వెళ్లడు అని పోలీసులు తెలిపారు. పోలీసులకు దొరకద్దనే ఉద్దేశంతోనే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుడు దోపిడీకి ముందు, ఆ తర్వాత బట్టలు మార్చుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు అనేక దోపిడీలకు పాల్పడినప్పటికీ.. 10 కేసుల్లో మాత్రం నేరం అంగీకరించాడు హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుడు.