Income Tax | ‘వంటవాడి’కి రూ. 46 కోట్ల పన్ను.. కోర్టును ఆశ్రయించిన ‘కుక్’
Income Tax | ఓ వంటవాడికి ఆదాయపు పన్ను( Income Tax ) శాఖ అధికారుల నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. ఆ కుక్( Cook )కు రూ. 46 కోట్ల పన్ను విధించడంతో.. ఆ వంటవాడు వార్తల్లో నిలిచాడు. కోట్ల రూపాయాల్లో పన్ను విధించడంతో.. ఆ కుక్ కోర్టు( Court ) మెట్లెక్కాడు.

Income Tax | హైదరాబాద్ : ఓ వంటవాడికి ఆదాయపు పన్ను( Income Tax ) శాఖ అధికారుల నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. ఆ కుక్( Cook )కు రూ. 46 కోట్ల పన్ను విధించడంతో.. ఆ వంటవాడు వార్తల్లో నిలిచాడు. కోట్ల రూపాయాల్లో పన్ను విధించడంతో.. ఆ కుక్ కోర్టు( Court ) మెట్లెక్కాడు.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్( Madhya Pradesh )లోని భింద్‌కు చెందిన రవీంద్ర సింగ్ చౌహాన్( Ravindra Singh Chauhan ) అనే వ్యక్తి వృత్తిరీత్యా కుక్(వంట మనిషి). రూ. 10 వేలకు ఓ హోటల్( Hotel )లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే అతనికి ఆదాయపు పన్ను( Income Tax ) శాఖ అధికారులు ఏకంగా రూ. 46.18 కోట్ల పన్ను నోటీసును పంపించారు. దీంతో ఆ వంటవాడ్( Cook ) షాక్‌కు గురై.. చివరకు తనతో పాటు పని చేసిన ఓ ఉద్యోగి మోసం చేయడం వల్లే ఇలా జరిగిందని నిజం తెలుసుకున్నాడు.
ఈ ట్యాక్స్ నోటీసుపై రవీంద్ర సింగ్ చౌహాన్ స్పందించాడు. 2017లో గ్వాలియర్‌లోని ఓ టోల్‌ప్లాజాలో ఉద్యోగిగా చేరాను. బీహార్‌లోని బక్సర్‌కు చెందిన శశి భూషణ్ రాయ్ అనే సూపర్‌వైజర్ తన పీఎఫ్ డబ్బుకు అదనంగా రూ. 5 వేల వరకు ఆదాయం సమకూరుస్తానని నమ్మబలికి ఢిల్లీకి తనను తీసుకెళ్లాడు. 2019 నవంబర్ 12వ తేదీన ఢిల్లీ ఉత్తమ్‌నగర్ వెస్ట్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో తన పేరు మీద అకౌంట్ ఓపెన్ చేశాడు శశి భూషణ్. ఓ పది నెలల పాటు అదనపు ఆదాయం కోసం ఎదురుచూశాను. కానీ ఆ ఆదాయం తన చేతికి అందకపోవడంతో.. ఖాతాను మూసివేసేందుకు ఢిల్లీకి వెళ్లాను. కానీ జీఎస్టీ బ్రాంచ్ నుంచి అనుమతి తీసుకుని వస్తేనే అకౌంట్ క్లోజ్ చేయబడుతుందని బ్యాంక్ అధికారులు చెప్పారు. దీంతో శశిభూషణ్‌ను రవీంద్ర సింగ్ సంప్రదించగా.. తానే ఖాతాను మూసివేయిస్తానని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నమ్మబలికాడు. ఇక 2023లో టోల్ ప్లాజా ఒప్పందం ముగియడంతో తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఉన్న ఖాతా గురించి కూడా మరిచిపోయినట్లు రవీంద్ర సింగ్ తెలిపాడు.
అయితే ఈ ఫేక్ అకౌంట్ ద్వారా కోట్లాది రూపాయాల లావాదేవీలు జరిగాయని తెలిసిందని రవీంద్ర సింగ్ తెలిపాడు. రూ. 10 వేల జీతానికి హోటల్‌లో వంటవాడిగా పని చేస్తున్నాను. 10 వేల జీతానికి రూ. 46 కోట్ల పన్ను ఏంటని ఆశ్చర్యపోయాను. మొత్తానికి తనను వచ్చిన ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులపై గ్వాలియర్‌లోని హైకోర్టు బెంచ్‌ను ఆశ్రయించినట్లు రవీంద్ర సింగ్ పేర్కొన్నాడు. ఈ అంశంపై విచారణ కొనసాగుతుందన్నాడు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలిసారిగా రవీంద్ర సింగ్‌కు రూ. 46.18 కోట్ల పన్ను నోటీసులు వచ్చింది. ఈ లేఖ ఇంగ్లీష్‌లో ఉండడంతో అతని కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు. ఆ సమయంలో అతను పుణెలో ఉన్నాడు. మళ్లీ జులై నెలలో రెండోసారి నోటీసు వచ్చింది. ఈ నోటీసు గురించి రవీంద్రకు అతని భార్య చెప్పింది. దాంతో పుణెలో ఉద్యోగం వదిలేసి వచ్చి.. నోటీసుపై లాయర్‌ను సంప్రదించినట్లు రవీంద్ర పేర్కొన్నాడు.