Indian Railway | మీరు రైలులో ప్రయాణిస్తుంటారా..? కరెంట్ బుకింగ్, తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్ల మధ్య తేడాలేంటో తెలుసా..?
Indian Railway | ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో భారతీయ రైల్వే ఒకటి. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారంతా రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. భద్రతతో పాటు తక్కువ ఛార్జీలు ఉండడంతో ప్రయాణికులంతా రైల్వేపైనే ఆధారపడుతుంటారు.

Indian Railway | ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో భారతీయ రైల్వే ఒకటి. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారంతా రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. భద్రతతో పాటు తక్కువ ఛార్జీలు ఉండడంతో ప్రయాణికులంతా రైల్వేపైనే ఆధారపడుతుంటారు. అయితే, రైళ్లలో ప్రయాణానికి ముందు తప్పనిసరిగా టికెట్ బుక్ చేసుకోవాల్సిందే. అత్యవసరంగా ప్రయాణాలు సాగించే వారి కోసం తత్కాల్, ప్రీమియం తత్కాల్ సేవలతో పాటు కరెంట్ బుకింగ్ సదుపాయం కల్పిస్తున్నది. అయితే, తత్కాల్, ప్రీమియం, కరెంటు బుకింగ్‌లో చాలానే తేడాలున్నాయి. అత్యవసర ప్రయాణం కోసం ఒక రోజు ముందుగా రైలు టికెట్‌ను అడ్వాన్స్‌గా తీసుకునేందుకు అవకాశం ఉంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రయాణికులు ఏసీలో ప్రయాణం చేసేందుకు ఉదయం 10 గంటలు, స్లీపర్ క్లాస్‌లో ప్రయాణానికి 11 గంటలకు టికెట్ల తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
తత్కాల్ టికెట్లకు సైతం భారీగానే పోటీ ఉంటుంది. తత్కాల్‌లోనూ టికెట్లు ధరకని వారు ప్రీమియం తత్కాల్‌లో టికెట్లు కొనుగోలు చేయవచ్చు. దాంతో టికెట్ కన్ఫర్మేషన్ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. కానీ, ధర సైతం భారీగానే ఉంటుంది. అయితే, అందుబాటులో ఉన్న టికెట్లను బట్టి మాత్రమే దొరికే అవకాశం ఉంటుంది. చివరి సమయంలో ప్రయాణలు చేసేవారికి తత్కాల్, ప్రీమియం తత్కాల్ సేవలు ఉపయోగపడుతాయి. ఇక కరెంట్ బుకింగ్ విషయానికి వస్తే.. ప్రయాణానికి కొద్ది గంటల ముందు మాత్రమే అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణానికి నాలుగు గంటల ముందు బుకింగ్ మొదలవుతుంది. చివరి నిమిషంలో టికెట్లు రద్దు చేసుకున్న వారు.. లేదంటే మిగిలిపోయిన టికెట్లను కరెంట్ బుకింగ్‌లో రైల్వేశాఖ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతుంది. దాంతో ప్రయాణికులు అత్యసర సమయాల్లో కరెంటు బుకింగ్ కింద ఏవైనా టికెట్లు అందుబాటులో ఉంటు బుక్ చేసుకొని.. చేసుకొని ప్రయాణం కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది.