అత‌డు ట్రాఫిక్ ప‌ద్మ‌వ్యూహంలో చిక్కుకున్నాడు. కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్‌.. బంప‌ర్ టు బంప‌ర్ వాహ‌నాలు క‌దులుతున్న ప‌రిస్థితి. గంట‌ల త‌ర‌బ‌డి రోడ్ల‌పైనే నిరీక్ష‌ణ‌. దాదాపుగా గంట‌కు ఒక కిలోమీట‌రు మాత్ర‌మే వాహ‌నాలు న‌డిచే దుస్థితి

  • త‌ప్ప‌లేదు మ‌రి.. ఇంకేం చేస్తాడు..
  • అత‌డే మొద‌లు కాదు.. ఆఖ‌రు కాదు!!


విధాత‌: అత‌డు ట్రాఫిక్ ప‌ద్మ‌వ్యూహంలో చిక్కుకున్నాడు. కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్‌.. బంప‌ర్ టు బంప‌ర్ వాహ‌నాలు క‌దులుతున్న ప‌రిస్థితి. గంట‌ల త‌ర‌బ‌డి రోడ్ల‌పైనే నిరీక్ష‌ణ‌. దాదాపుగా గంట‌కు ఒక కిలోమీట‌రు మాత్ర‌మే వాహ‌నాలు న‌డిచే దుస్థితి. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న అత‌డిని కాల కృత్యాలు తీర్చుకోవాల‌నిపించింది.

చాలాసేపు ఆపుకున్నాడు. ఇంకా కొద్దిసేపు ఉగ్గ‌బ‌ట్టుకొని ఆగారుడు. కానీ, ఎటుచూసినా వాహ‌నాలే.. మ‌ధ్య‌లో అత‌డు.. కాస్త సంకోచించాడు. ఇక ఆపులేక‌పోయాడు వెంట‌నే కారు డోరు తీశాడు. కారు డోరుపై మూత్రం పోశాడు. ఈ ఘ‌ట‌న సోమ‌వారం సాయంత్రం ఉత్త‌రప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నో న‌గ‌రంలో చోటుచేసుకున్న‌ది.

త‌న కారు డోరుపై మూత్రం చేస్తున్న అత‌డి చ‌ర్య‌ను వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఇత‌డే మొద‌లు కాదు.. అనే శీర్శిక‌తో 17 సెకండ్ల వీడియో పోస్టుచేయ‌గా వైర‌ల్‌గా మారింది. ప‌లువురు అత‌డి తీరును విమ‌ర్శించారు. క‌నీస‌ ఇంగిత జ్ఞానం లేదు.. ఇలాగేనా ప‌బ్లిక్‌లో చేసేది.. అంటూ మండిప‌డ్డారు. మ‌రికొంద‌రు అత‌డి నిస్సాహాయ ప‌రిస్థితికి జాలిప‌డ్డారు. ఏం చేస్తాడు .. మ‌రి త‌ప్ప‌లేదు.. అర్జెంట్.. అత‌డే మొద‌లు కాదు.. ఆఖ‌రు కాదు!! అంటూ సానుభూతి ప్ర‌క‌టించారు.

Somu

Somu

Next Story