రామ మందిరం పోస్టల్ స్టాంపులను విడుదల చేసిన ప్రధాని మోడీ
అయోధ్య రామమందిరం విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం వేళ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రామమందిరం పై స్మారక పోస్టల్ స్టాంపు లను విడుదల చేశారు

విధాత : అయోధ్య రామమందిరం విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం వేళ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రామమందిరం పై స్మారక పోస్టల్ స్టాంపు లను విడుదల చేశారు. రామమందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్ రాజ్, శబరిమాతపై మొత్తం ఆరు స్టాంపులను విడుదల చేశారు. అయోధ్య ఆలయ ఆకృతి, మందిరం ఆవరణలోని కళాఖండాలు, సూర్యభగవానుడు, సరయూ నది ప్రతిబింబించేలా వీటిని డిజైన్ చేశారు. ‘మంగళ్’ భవన్ అమంగళ్ హరి’ అనే కవిత్వాన్ని కూడా ముద్రించారు. అలాగే శ్రీరాముడిపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైన స్టాంపులతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. 48 పేజీల ఈ పుస్తకంలో 20కి పైగా దేశాలు విడుదల చేసిన స్టాంపులను పొందుపరిచారు. అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కాంబోడియా దేశాలు సహా ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు శ్రీరాముడిపై స్మారక స్టాంపులను విడుదల చేశాయి. మరోవైపు అయోధ్య వాతావరణం ప్రజలకు తెలిపేందుకు వీలుగా భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రత్యేక పేజీని ప్రారంభించింది