Vande Metro | త్వరలోనే పట్టాలెక్కనున్న వందే మెట్రో.. తొలుత పరుగులు తీసేది ఈ నగరం నుంచే..!

Vande Metro | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్‌ రైళ్లకు మంచి స్పందన లభిస్తున్నది. ఈ క్రమంలో రైల్వేశాఖ మరో ముందడుగు వేస్తున్నది. త్వరలోనే వందే మెట్రోను సైతం పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. నగరాల్లోని ప్రయాణికులకు అవసరాలను తీర్చేందుకు మెట్రోను ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నది. త్వరలోనే రైళ్లను ప్రయోగాత్మకంగా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Vande Metro | త్వరలోనే పట్టాలెక్కనున్న వందే మెట్రో.. తొలుత పరుగులు తీసేది ఈ నగరం నుంచే..!

Vande Metro | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్‌ రైళ్లకు మంచి స్పందన లభిస్తున్నది. ఈ క్రమంలో రైల్వేశాఖ మరో ముందడుగు వేస్తున్నది. త్వరలోనే వందే మెట్రోను సైతం పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. నగరాల్లోని ప్రయాణికులకు అవసరాలను తీర్చేందుకు మెట్రోను ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నది. త్వరలోనే రైళ్లను ప్రయోగాత్మకంగా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జులై ట్రయల్‌ రన్‌ నిర్వహించి.. ఆ తర్వాత రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారి వెల్లడించారు. వేగంగా ప్రయాణించడంతో పాటు తక్షణమే ఆగేలా నూతన టెక్నాలజీని రైల్వేశాఖ వందే మెట్రోలో వినియోగిస్తున్నది. దాంతో తక్కువ సమయంలో ఎక్కువ స్టాప్‌లలో ఆగేందుకు వీలవుతుంది.

నగర ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సరికొత్త ఫీచర్లను సైతం అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఈ ఏడాది వందే మెట్రో రైళ్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారి తెలిపారు. వచ్చే రెండు నెలల తర్వాత ట్రయల్‌ రన్‌ మొదలవుతుందని.. ప్రస్తుతం నడుస్తున్న మెట్రోలో లేని సదుపాయాలు ఈ కొత్త రైళ్లలో ఉంటాయని తెలిపారు. త్వరలోనే రైళ్లకు సంబంధించిన వివరాలు, ఫొటోలు విడుదల చేయనున్నట్లు అధికారి వివరించారు. అదే సమయంలో ఏ నగరంలో తొలుత మెట్రోను నడిపించాలనే విషయాన్ని సైతం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం.. మేరకు మెట్రోల బోగీల అమరిక ప్రత్యేకంగా ఉండనున్నది. నాలుగేసి కోచ్‌లను ఓ యూనిట్‌గా పరిగణించనున్నారు. కనీసం 12 కోచ్‌లతో మెట్రో పరుగులు తీస్తుంది. డిమాండ్‌ను బట్టి కోచ్‌లను 16కి పెంచే అవకాశాలున్నాయి.