Air India flight: మ‌రో విమానంలో సాంకేతిక లోపం

Air India flight: మ‌రో విమానంలో సాంకేతిక లోపం

Air India flight:  విధాతః అహ్మ‌దాబాద్ ఫ్లైట్ ప్ర‌మాదం అనంత‌రం విమాన ప్ర‌మాదాల‌పై అధికారులు అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం త‌లెత్తింది. తాజాగా ఎయిరిండియా విమానం ఐఎక్స్‌ 1511లో సాంకేతిక లోపం త‌లెత్తింది. ఈ ఫ్లైట్ యూపీలోని ఘ‌జియాబాద్ నుంచి కోల్ క‌తాకు బ‌యలుదేరాల్సి ఉండ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

టేకాఫ్‌కు కాసేపటికి ముందు విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని వెంటనే గుర్తించిన సంస్థ అప్రమత్తమైంది. దీంతో విమాన ప్రయాణాన్ని నిలిపివేసింది. 7 గంటలు ఆలస్యంగా బయలుదేరనుందని తెలిపింది. ప్ర‌యాణికుల‌కు క‌లిగిన అసౌక‌ర్యానికి చింతిస్తున్నామ‌ని ఎయిర్ ఇండియా తెలిపింది.

ప్రయాణికుల‌కు రీఫండ్ చెల్లిస్తామ‌ని వెల్ల‌డించింది.