విద్యావిధానంలో మార్పులు అందరికీ ఆమోదయోగ్యం అయి ఉండాలి

విధాత :పాఠశాల విద్యలో పెను మార్పులు చేపడుతూ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఎన్ ఇ పి జాతీయ విద్యా విధానం పాలసీని రాష్ట్రంలో అమలు పరిచేందుకు ప్రభుత్వం ఎందుకు హడావుడిగా ఈ విధానాన్ని ప్రవేశ పెడుతుంది దీని వలన కలిగే ప్రయోజనాల కంటే విద్యార్థులకు, నిరుద్యోగులకు నష్టం వాటిల్లే విధంగా ఉందని నూతన విద్యా విధానంలో మార్పులు అందరికీ ఆమోదయోగ్యం అయితేనే ఈ విధానాన్ని అమలు చేయాలే తప్ప […]

విద్యావిధానంలో మార్పులు అందరికీ ఆమోదయోగ్యం అయి ఉండాలి

విధాత :పాఠశాల విద్యలో పెను మార్పులు చేపడుతూ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఎన్ ఇ పి జాతీయ విద్యా విధానం పాలసీని రాష్ట్రంలో అమలు పరిచేందుకు ప్రభుత్వం ఎందుకు హడావుడిగా ఈ విధానాన్ని ప్రవేశ పెడుతుంది దీని వలన కలిగే ప్రయోజనాల కంటే విద్యార్థులకు, నిరుద్యోగులకు నష్టం వాటిల్లే విధంగా ఉందని నూతన విద్యా విధానంలో మార్పులు అందరికీ ఆమోదయోగ్యం అయితేనే ఈ విధానాన్ని అమలు చేయాలే తప్ప ఏకపక్ష ధోరణి లో వ్యవహరించటం సరికాదేమో ?

రాష్ట్రంలో వైయస్సార్ ఫ్రీ ఫై మరీ పాఠశాలలు, పౌండేషన్ పాఠశాలలు ఏర్పాటు చేసి వీటిని ప్రాజెక్ట్ లుకి గాని, సొసైటీలకు గానీ అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోన్న దరిమిలా భవిష్యత్తులో ఉపాధ్యాయ శాశ్వతం నియామకాలు ఆగిపోయే ప్రమాదం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక విద్యను అభ్యసించేవారు మూడు కిలోమీటర్ల దూరంలో వెళ్లి పాఠశాలలో చదివే పరిస్థితి నెలకొంటుంది దీనివలన డ్రాపౌట్స్ పెరిగి విద్యార్థులు విద్యకు దూరం అవుతారు .

విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక విద్యను బోధించే వారిని శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని ఉంది రాష్ట్రంలో 34000 ప్రాథమిక పాఠశాలలు ఉంటే 86000 sgt ఉపాధ్యాయుల పోస్టుల మంజూరు కావాలి, కానీ 70 వేలు మాత్రమే పనిచేస్తున్నారు మిగిలిన 16,000 పోస్టులు సంవత్సరాల తరబడి ఖాళీగా ఉన్నాయి.

ఈ నూతన జాతీయ విద్యా విధానం వలన ప్రాథమికోన్నత నుంచి పాఠశాల గా మార్చడం ఆ విధంగా ఉన్నత పాఠశాలలో 11 ,12 తరగతుల ప్రవేశపెట్టడం ఏది ఇది ఎంతవరకు సాధ్యమనేది గమనించాలి .

ఇప్పటికీ చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలాచోట్ల ఉన్నత పాఠశాల కొరత ఉంది ఈ విధానం వలన పిల్లలు చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. మూడో తరగతి నుంచి 12వ తరగతి పాఠశాలలో బోధన బోధనేతర సిబ్బంది లేకపోవడం మౌలిక వసతులు లేకపోవడం వలన ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంగన్వాడి సెంటర్లు కనుమరుగవుతాయి. ఇన్ని సమస్యలతో ప్రభుత్వం హుటాహుటిన నూతన విద్యా విధానం అమలుపరచడం ఎంతవరకు సాధ్యము గమనించి విద్యావిధానంలో అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతులను అవలంభించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పరసా రంగనాథ్ అన్నారు.