డ్రైవింగ్ లైసెన్సులు జులై ఒకటి నుండి పున ప్రారంభం
విధాత:కోవిడ్ కారణముగా నిలిచిపోయిన లెర్నర్ లైసెన్స్ లు,డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షల ను జులై ఒకటి తారీకు నుండి పున ప్రారంభిస్తున్నామని డిటీసీ యం పురేంద్ర తెలిపారు. బందరు రోడ్డు లోని డిటీసీ కార్యాలయం నుండి ఒక ప్రకటనను విడుదల చేసారు. డిటీసీ యం పురేంద్ర మాట్లాడుతూ మే, జూన్ నెలలో లెర్నర్ లైసెన్స్ లు ,డ్రైవింగ్ లైసెన్స్ ల పరీక్షల కొరకు అభ్యర్థులు స్లాట్ బుకింగ్ చేసుకునప్పటికి కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా మే,జూన్ నెలల్లో జరగాల్సిన […]

విధాత:కోవిడ్ కారణముగా నిలిచిపోయిన లెర్నర్ లైసెన్స్ లు,డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షల ను జులై ఒకటి తారీకు నుండి పున ప్రారంభిస్తున్నామని డిటీసీ యం పురేంద్ర తెలిపారు. బందరు రోడ్డు లోని డిటీసీ కార్యాలయం నుండి ఒక ప్రకటనను విడుదల చేసారు. డిటీసీ యం పురేంద్ర మాట్లాడుతూ మే, జూన్ నెలలో లెర్నర్ లైసెన్స్ లు ,డ్రైవింగ్ లైసెన్స్ ల పరీక్షల కొరకు అభ్యర్థులు స్లాట్ బుకింగ్ చేసుకునప్పటికి కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా మే,జూన్ నెలల్లో జరగాల్సిన లెర్నర్ లైసెన్స్ , డ్రైవింగ్ లైసెన్స్ ల పరీక్షలసు తాత్కాలికంగా నిలుపుదల చెయ్యడం జరిగిందని, కరోన వ్యాధి తగ్గుముఖం పడుతుండటంతో జిల్లాలోని అధికారులతో చర్చించి లెర్నర్ లైసెన్స్ , డ్రైవింగ్ లైసెన్స్ ల పరీక్షలసు జూలై ఒకటి నుండి పున ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. మే జూన్ నెలల్లో లెర్నర్ లైసెన్స్ లు,డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షల కొరకు స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు జులై ఒకటవ తారీఖు నుండి పరీక్షలకు హాజరవచ్చునని ముందుగా రవాణాశాఖ వెబ్సైట్ aprtacitizen.epragathi.org లో స్లాట్స్ ను జులై ఒకటవ తారీకు నుండి అభ్యర్థుల సౌకర్యమైన తేదీకి మార్చుకోవచ్చునని అన్నారు. స్లాట్ బుకింగ్ తారీఖును మార్చుకోనుటలో ఏదైనా ఇబ్బందులు ఉన్నచో సంబంధిత ఆర్టీఏ కార్యాలయాల్లో సంప్రదించవచ్చునన్నారు.
మే జూన్ నెలలో కొత్త డ్రైవింగ్ లైసెన్సు పరీక్షల కొరకు స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థుల లెర్నెర్ లైసెన్సు ల కాలపరిమితి గడువు ముగిసినప్పటికి ఆయా లెర్నర్ లైసెన్స్ ల గడువును రెండు నెలలు స్వయంచాలకంగా (Automatically) పొడిగించడం జరిగిందన్నారు. కోవిడ్ వలన నిలిచిపోయిన మే జూన్ నెలలకు సంబందించిన లెర్నర్ లైసెన్స్ లు, డ్రైవింగ్ లైసెన్స్ ల స్లాట్స్ యొక్క పరీక్షల నిర్వహణ పూర్తి అయిన తర్వాత మాత్రమే జులై నెల నుండి కొత్త అభ్యర్థులు లెర్నర్ లైసెన్స్ లు,డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేసుకోగలరని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ, కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ డ్రైవింగ్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చే అభ్యర్థులు మాస్క్ లను ధరించి రావాలని, మాస్క్ దరించనిచో డ్రైవింగ్ పరీక్షలకు అనుమతించబోమని డిటీసీ అన్నారు. ఈ విషయాలపై ఎటువంటి సందేహాలు ఉన్న విజయవాడ-9154294214, గుడివాడ-9154294476, నందిగామ-9550911139,
నూజివీడు – 9948287226,
మచిలీపట్టణం – 9154294479,
ఉయ్యురు -9154294483,
జగ్గయ్యపేట – 9154294701 జిల్లాలోని అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చునని డిటీసీ యం పురేంద్ర తెలిపారు.