Gold Loans in banks | వామ్మో.. గోల్డ్ లోన్స్ కోసం రైతులకు, సామాన్యులకు ఇన్ని తిప్పలా?
ఆర్థిక పరిస్థితులు బాగోలేకనో, పిల్లల చదువులకో, అప్పులు తీర్చేందుకో, కుటుంబ లేదా వ్యవసాయ, వ్యాపార అవసరాలకో (rural financial crisis) తమ బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు తమ లోన్ రెన్యూవల్ చేయడంలేదన్న చేదు నిజం తెలుసుకుని హతాశులవుతున్నారు.

Gold Loans in banks | గోల్డ్ లోన్స్ (బంగారం తాకట్టు రుణాలు)కు (Gold Loans in banks) సంబంధించి ఇటీవల ఆర్బీఐ తీసుకొచ్చిన మార్పుల పట్ల సామాన్యులు, రైతులు, మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. గతంలో ఉన్న నిబంధనలు మార్చి పెరిగిన బంగారం ధర విలువను అనుసరించి రుణగ్రహీతలకు మరింత సులభతరమైన నిబంధనలు తెస్తారనుకుంటే.. అందుకు విరుద్ధంగా వారిని ఇబ్బందుల పాలు చేసే కొత్త నిబంధనలు (RBI gold loan rules) తేవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా ఇప్పటికే తమ బంగారాన్ని తాకట్టు పెట్టిన రుణగ్రహీతల గోల్డ్ లోన్లను రెన్యూవల్ చేయడంలో తెచ్చిన కొత్త నిబంధన సామాన్య ప్రజలకు, రైతులకు, మహిళలకు షాక్‌గా మారింది. బంగారు ఆభరణాల రుణాలను రెన్యువల్, రీషెడ్యూల్ చేయడాన్ని బ్యాంకులు నిలిపి వేశాయి. ఆర్బీఐ నిబంధనల్ని బ్యాంకులు పక్కాగా అమలు చేస్తుండటంతో రుణాలను నిర్ణీత వ్యవధిలోగా తీర్చేయాల్సిందేనని తేల్చి చెబుతుండటంతో రుణగ్రహీతలపై ఒత్తిడి పెరుగుతోంది. తీసుకున్న రుణం తిరిగి చెల్లించేందుకు కావాల్సిన డబ్బును సమకూర్చుకోవడంలో నానాపాట్లు పడుతున్నారు. గతంలో బంగారు రుణాలను రెన్యూవల్ చేసే సమయంలో అదే బంగారంపై మరో లోన్ జనరేట్ చేసేవారు. పాత రుణ మొత్తాన్ని అసలులో జమ చేసుకుని, వడ్డీని రుణ గ్రహీత నుంచి వసూలు చేసేవారు. రెన్యూవల్ (gold loan renewal) సమయంలో బంగారం ధర పెరిగితే ఆ మేరకు అదనపు డబ్బులు కూడా ఇచ్చేవారు. ప్రస్తుతం బ్యాంకులు పాత రెన్యూవల్ విధానాన్ని అనుమతించడం లేదు.
రుణ కాల పరిమితి ఏడాది..మొత్తం కట్టాల్సిందే
గోల్డ్ లోన్ కొత్త నిబంధనల మేరకు రుణగ్రహీతలు తమ బంగారంపై తీసుకున్న మొత్తాన్ని ఏడాది కాలపరిమితి తీరగానే వడ్డీతో సహా చెల్లించి తిరిగి కొత్తగా రుణం తీసుకోవాలి. లేదంటే జరిమాన వడ్డీలు తప్పవు. ఈ నిబంధనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆర్థిక పరిస్థితులు బాగోలేకనో, పిల్లల చదువులకో, అప్పులు తీర్చేందుకో, కుటుంబ లేదా వ్యవసాయ, వ్యాపార అవసరాలకో (rural financial crisis) తమ బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు తమ లోన్ రెన్యూవల్ చేయడంలేదన్న చేదు నిజం తెలుసుకుని హతాశులవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే తాము గోల్డ్ లోన్లు తీసుకుంటే… ఇప్పుడు ఆ డబ్బంతా తెచ్చి కట్టమంటే ఎక్కడి నుంచి తేవాలంటూ రుణగ్రహీతలు ప్రశ్నిస్తున్నారు. సామాన్యులు, రైతులపై తలకు మించిన భారాన్ని మోపుతున్న ఈ తరహా నిబంధనలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే తరహా నిబంధనలు బడా పారిశ్రామిక వేత్తలకు కూడా ఎందుకు అమలు చేయబోరంటూ ఆర్బీఐని కడిగి పారేస్తున్నారు. గోల్డ్ లోన్లలో వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలకైనా పాత రెన్యూవల్ విధానాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రుణ మొత్తం పెరిగితే..పన్ను భారం
బ్యాంకుల వాణిజ్య కార్యకలాపాలకు నష్టం కలిగిస్తోందనే ఉద్దేశంతోనే బంగారు రుణాలను రెన్యువల్ (RBI policy change) చేయడంపై ఆర్బీఐ నిషేధం విధించిందంటున్నారు బ్యాంకర్లు. వ్యవసాయ అవసరాల కోసం కోసం తీసుకునే బంగారు రుణాల పరిమితి ఏడాదికి పరిమితం చేసిందని.. నిబంధనలను పాటించని బ్యాంకర్లకు ఆర్బీఐ పెనాల్టీ వేస్తుందని చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా కొత్త నిబంధనలలో 3లక్షల కంటే ఎక్కువ లోన్ తీసుకుంటే 0.5శాతం టాక్స్ విధిస్తున్నారు. అయితే లోన్ టూ వాల్యూ(ఎల్ టీవీ) రేషియో మేరకు రూ.2.5లక్షల కంటే తక్కువ రుణాలలో తాకట్టు పెట్టిన బంగారం తులం ధరపై ప్రస్తుతం 75శాతం ఇస్తున్న రుణం ఇక మీదట 85శాతంగా ఇస్తామంటున్నారు. అంటే రూ.లక్ష విలువైన బంగారంపై రూ.85వేలు రుణం అందనుంది. రూ.2.5నుంచి 5లక్షల లోన్ వరకు బంగారం విలువపై 80శాతంగా, రూ.5లక్షలకు పైన లోన్ పై బంగారం విలువలో 75శాతంగా రుణం ఇస్తున్నారు. అయితే ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా నిబంధనలు అమలు చేస్తుండటంతో రుణగ్రహీతలు ఏ బ్యాంకులో ఎలా ఇస్తున్నారన్నదానిపై వివరాలు తెలుసుకుంటే మంచిందంటున్నారు నిపుణులు. అలాగే గోల్డ్ లోన్ కొత్త నిబంధనలలో తాకట్టు పెట్టే బంగారం, వస్తువుల రూపంలో 1కేజీకి మించరాదని పేర్కొన్నారు. వెండి వస్తువులు అయితే రూ.10కేజీలకు మించరాదు. గోల్డ్ కాయిన్స్ రూపంలో ఉంటే ఒక్కో కాయిన్ 50 గ్రాములకు మించరాదు. వెండి కాయిన్స్ అయితే ఒక్కో కాయిన్ 500 గ్రాములకు మించరాదు. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలన్నీ ఈ నిబంధనలు పాటించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
Army Helicopter: ఆర్మీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Pawan Kalyan: ఇక్రిశాట్ స్కూల్ లో పవన్ కల్యాణ్ చిన్న కొడుకు అడ్మిషన్!
Air India Flight: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు..సముద్రంపై చక్కర్లు !