Gold Price | అంతర్జాతీయ మార్కెట్‌లో పతనమైన పసిడి..! హైదరాబాద్‌లో ధరలు ఇలా..!

Gold Price | అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి భారీగా పతనమైంది. డాలర్‌ ఇండెక్స్‌ పెరగడంతో బంగారం తగ్గింది. ప్రస్తుతం ఔన్స్‌కు 1,936 డాలర్లు పలుకుతున్నది. మరో వైపు దేశంలో బంగారం తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.340 తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.380 పతనమైంది. వెండి కిలోకు రూ.1000 తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,650 ఉండగా.. 24 […]

Gold Price | అంతర్జాతీయ మార్కెట్‌లో పతనమైన పసిడి..! హైదరాబాద్‌లో ధరలు ఇలా..!

Gold Price |

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి భారీగా పతనమైంది. డాలర్‌ ఇండెక్స్‌ పెరగడంతో బంగారం తగ్గింది. ప్రస్తుతం ఔన్స్‌కు 1,936 డాలర్లు పలుకుతున్నది.

మరో వైపు దేశంలో బంగారం తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.340 తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.380 పతనమైంది. వెండి కిలోకు రూ.1000 తగ్గింది.

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,600 పతనమైంది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,450కి తగ్గింది.

చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.54,800 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,780 వద్ద ట్రేడవుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.59,450 వద్ద కొనసాగుతున్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.59,450కి చేరింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉండగా.. వెండి కిలోకు రూ.1000 పతనమైది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలోకు రూ.78వేలు పలుకుతున్నది.