Gold Rate | భారీగా పతనమవుతున్న వెండి..! బంగారం పైపైకి..! హైదరాబాద్‌లో నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rate | బులియన్‌ మార్కెట్‌లో సోమవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర భారీగా పతనమవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.54,400 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.రూ.59,330 వద్ద కొనసాగుతున్నది. ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.54,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.59,180 వద్ద ట్రేడవుతున్నది. చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి రేటు రూ.54,550 […]

Gold Rate | భారీగా పతనమవుతున్న వెండి..! బంగారం పైపైకి..! హైదరాబాద్‌లో నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rate | బులియన్‌ మార్కెట్‌లో సోమవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర భారీగా పతనమవుతున్నది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.54,400 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.రూ.59,330 వద్ద కొనసాగుతున్నది.

ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.54,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.59,180 వద్ద ట్రేడవుతున్నది.

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి రేటు రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.59,510 వద్ద కొనసాగుతున్నది.బెంగుళూరులో 22 క్యారెట్ల పుత్తడి రేటు రూ.54,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,180 వద్ద ఉన్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.54,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.59,180 కొనసాగుతున్నది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇక హైదరాబాద్‌లో కిలో వెండి రూ.74,500 కొనసాగుతున్నది. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్ పుంజుకుంటుండడంతో బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయి.

ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1,927 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 22.58 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.81.985 మార్క్ వద్ద ట్రేడవుతోంది.