మరో అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక
విధాత:విశ్వనగరి భాగ్యనగరి మరో అంతర్జాతీయ భేటీకి వేదిక కానుంది. 2022 అక్టోబర్‌లో జరిగే గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ సదస్సుకు భారత్ అతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో జియోస్పేషియల్ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సదస్సుకు సంబంధించి సన్నాహక సమావేశం జరిగినట్లు కేంద్ర ఐటీ శాఖ వెల్లడించింది. అగ్రరాజ్యాలకు చెందిన జియో స్పేషియల్ నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటారని వెల్లడించింది. కాగా, 2018లో చైనాలో తొలి గ్లోబల్ జియో స్పేషియల్ సదస్సు జరగగా, రెండోసారి […]

విధాత:విశ్వనగరి భాగ్యనగరి మరో అంతర్జాతీయ భేటీకి వేదిక కానుంది. 2022 అక్టోబర్‌లో జరిగే గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ సదస్సుకు భారత్ అతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో జియోస్పేషియల్ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సదస్సుకు సంబంధించి సన్నాహక సమావేశం జరిగినట్లు కేంద్ర ఐటీ శాఖ వెల్లడించింది. అగ్రరాజ్యాలకు చెందిన జియో స్పేషియల్ నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటారని వెల్లడించింది. కాగా, 2018లో చైనాలో తొలి గ్లోబల్ జియో స్పేషియల్ సదస్సు జరగగా, రెండోసారి భారత్ అతిథ్యం ఇవ్వనుంది.