Warangal: అజాంజాహి మిల్లు కార్మిక భవన్ అమ్మకం, కొనుగోలుతో సంబంధంలేదు

న్యాయవాది చిక్కుడు ప్రభాకర్
విధాత: అజాంజాహి మిల్లు కార్మిక భవన్ అమ్మకం, కొనుగోలులో వస్తున్న నా పై వస్తున్న ఆరోపణలతో నాకు ఎటువంటి సంబంధం లేదని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన పై చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని తెలిపారు. తన పై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
అజాంజాహి మిల్లు కార్మిక భవన్ అమ్మిన వారిని, కొన్న వారిని నేను నా జీవితంలో ఎన్నడూ ప్రత్యక్షంగా, పరోక్షంగా కలవలేదని ప్రభాకర్ వివరణ ఇచ్చారు. తన పైన ఆరోపణలు చేసిన మావోయిస్టు, న్యూడెమోక్రసీ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులను తన పై చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన నిర్దిష్ట ఆధారాలు చూపెట్టమని డిమాండ్ చేయగా వారు నిరూపించలేక పోయారని ప్రభాకర్ స్పష్టం చేశారు.