Vande Metro | త్వరలో పట్టాలెక్కనున్న వందే మెట్రో..! రైలు ఎలా ఉండబోతుందంటే..?

Vande Metro | వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయవంతమైంది. ఇప్పటికే 17 వందే భారత్‌ రైళ్లను పట్టాలెక్కించింది. త్వరలో భారతీయ రైల్వే వందే మెట్రోను ప్రారంభించనున్నది. వందే మెట్రో 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రెండు నగరాలను కలుపనున్నది. అందిన సమాచారం మేరకు వందే మెట్రో తొలి రైలు ఈ ఏడాది అందుబాటులోకి రానున్నది. 2024-25 నాటికి భారీగా పెంచనున్నారు. వందే మెట్రో ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లే వారితో పాటు విద్యార్థులకు సైతం […]

Vande Metro | త్వరలో పట్టాలెక్కనున్న వందే మెట్రో..! రైలు ఎలా ఉండబోతుందంటే..?

Vande Metro | వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయవంతమైంది. ఇప్పటికే 17 వందే భారత్‌ రైళ్లను పట్టాలెక్కించింది. త్వరలో భారతీయ రైల్వే వందే మెట్రోను ప్రారంభించనున్నది. వందే మెట్రో 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రెండు నగరాలను కలుపనున్నది.

అందిన సమాచారం మేరకు వందే మెట్రో తొలి రైలు ఈ ఏడాది అందుబాటులోకి రానున్నది. 2024-25 నాటికి భారీగా పెంచనున్నారు. వందే మెట్రో ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లే వారితో పాటు విద్యార్థులకు సైతం ఉపయోగకరంగా ఉండనున్నది.

ఈ రైళ్లు ప్రయాణికులకు ప్రపంచస్థాయి ప్రయాణ అనుభూతిని కలిగిస్తాయని రైల్వేశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రైల్లను ప్రస్తుతం ఉన్న లోకల్‌ రైళ్లలో భారాన్ని తగ్గించేందుకు సహాయపడుతుందని రైల్వేశాఖ భావిస్తున్నది.

వందే మెట్రో ఎలా ఉండబోతుందంటే..?

వందే మెట్రోపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి కీలక సమాచారం అందించారు. 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరాల మధ్య ఈ రైలును ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ మెట్రో ఒక రోజుకు నాలుగు నుంచి ఐదు ట్రిప్పులు నడువనున్నది.

ఆసక్తికర విషయం ఏంటంటే.. వందే మెట్రో.. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కంటే ఎక్కువ వేగంతో నడువనున్నది. అదే సమయంలో ఇతర రైళ్లతో పోలిస్తే ఇందులో టికెట్‌ ధరలు సైతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ప్రయాణికులు వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడంతో.. చౌకగా ప్రయాణం చేసే అవకాశాలున్నాయి.

వందే మెట్రోలో ఎనిమిది కోచ్‌లో ఉండనున్నాయి. మొదట ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తున్నది. ముంబయి అంటే అందరికీ ఎక్కువగా గుర్తుకు వచ్చేది లోకల్‌ రైళ్లే. వాటితో ముంబైకర్లకు మంచి అనుబంధం ఉంది.

కానీ, త్వరలోనే ముంబయి లోకల్ రైళ్లు చరిత్రగా మారనున్నాయి. రైల్వే బోర్డు సబర్బన్ రైల్వే నెట్వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు 238 వందే మెట్రో రైళ్లను తయారు చేయనున్నట్లు సమాచారం.