YS Sharmila | పాలమూరు ప్రాజెక్టుతో ఒక్క ఎకరమైనా తడిసిందా?
YS Sharmila | దక్షిణ తెలంగాణాలో ఒక్కరి దూపైనా తీరిందా? కేసీఆర్ ఒక్క స్విచ్ వేస్తేనే పాలమూరు పచ్చబడ్డదా? పూర్తి గాని ప్రాజెక్టుతో దొర ఎన్నికల రాజకీయం విధాత ప్రతినిధి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వల్ల ఒక్క ఎకరం అయినా తడిసిందా అని సీఎం కేసీఆర్‌ను వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు. దొర గారిది మాటల సర్కారే గానీ చేతల సర్కార్ కాదనేది మరోసారి రుజువు చేసుకున్నారన్నారు. పూర్తి కాని ప్రాజెక్టును […]

- దక్షిణ తెలంగాణాలో ఒక్కరి దూపైనా తీరిందా?
- కేసీఆర్ ఒక్క స్విచ్ వేస్తేనే పాలమూరు పచ్చబడ్డదా?
- పూర్తి గాని ప్రాజెక్టుతో దొర ఎన్నికల రాజకీయం
విధాత ప్రతినిధి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వల్ల ఒక్క ఎకరం అయినా తడిసిందా అని సీఎం కేసీఆర్‌ను వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు. దొర గారిది మాటల సర్కారే గానీ చేతల సర్కార్ కాదనేది మరోసారి రుజువు చేసుకున్నారన్నారు. పూర్తి కాని ప్రాజెక్టును ప్రారంభించి పట్టపగలే కేసీఆర్ గారడీ చేశారని దుయ్యబట్టారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 31 మోటార్లకు ఒక్కటి పూర్తి చేసి దక్షిణ తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేస్తున్నట్లు డప్పు కొట్టుకోవడానికి సిగ్గుండాలని, పాలమూరు ప్రజలు ఎప్పుడూ కృష్ణా జలాలను చూడనే లేదన్నట్లు.. ఇప్పటి వరకు పాలమూరు రైతులు వ్యవసాయమే చేయలేదన్నట్లు కాకమ్మ కథలు చెబుతున్నారు బీఆర్ఎస్ బందిపోట్లు అంటూ తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు.
సగం పనులు కూడా పూర్తి కాని ప్రాజెక్టుతో ఎన్నికల రాజకీయం చేస్తున్న కేసీఆర్. ఒక్క మోటార్ స్విచ్ ఆన్ చేసి పాలమూరు పచ్చబడ్డట్లు కాకమ్మ కథలు చెప్తున్నారు. ఎనిమిదేళ్లుగా ప్రాజెక్టు పూర్తి చేయడం చేతకాలేదు కానీ దక్షిణ తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేస్తున్నట్లు చెప్పుకోవడానికి సిగ్గుండాలి.… pic.twitter.com/bMkILfZaok
— YS Sharmila (@realyssharmila) September 16, 2023
రాజశేఖర్ రెడ్డి35 వేల కోట్లతో పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టును కేసీఆర్ కమీషన్ల కోసం 52 వేల కోట్లకు పెంచేశారని, ఏళ్ల తరబడి కమీషన్లు తిన్నారే తప్ప ప్రాజెక్టు పూర్తి చేసింది లేదన్నారు. ఒక్క ఎకరాకు నీళ్లిచ్చింది లేదు.
వైయస్ఆర్ కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా పాలమూరులో దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తే.. కేసీఆర్ మాత్రం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టారని విమర్శించారు. దక్షిణ తెలంగాణలో ఈసారి బీఆర్ఎస్ కు డిపాజిట్లు గల్లంతేనని షర్మిల జోస్యం చెప్పారు.