స్వలింగుల వివాహా తీర్పుతో గుండె పగిలింది: మంచు లక్ష్మి

విధాత: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల నిరాశతో తన గుండె పగిలిపోయిందని తెలుగు సినీ నటి మంచు లక్ష్మి ఆవేదన, అసంతృప్తిని వ్యక్తం చేసింది. మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలిపింది. అన్ని రకాల ప్రేమలను స్వీకరించి.. మిగతా ప్రపంచానికి ప్రేమ గురించి బోధించే మన దేశానికి ఇది నిజంగా అవమానకరం.
ఇతర దేశాల్లో స్వలింగ సంపర్కులు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు. మన దేశంలో వీరి వివాహాలను అంగీకరించలేమా?” అని మంచు లక్ష్మి ట్విట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. అటు సుప్రీంకోర్టు తీర్పుపై పలువురు సినీ సెలబ్రిటీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాగా స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అధికారం కోర్టులకు లేదని సుప్రీంకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
My heart is broken as I write with such disappointment over the Supreme Court’s verdict refusing to legalize same-sex marriage. It is a true shame for a country that has embraced all forms of love and taught the rest of the world about love, yet has been denied this in its own…
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) October 18, 2023
స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలా? వద్దా? అనేది నిర్ణయించాల్సింది పార్లమెంటు మాత్రమేనని తేల్చిచెప్పింది. దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్వలింగ వివాహాల చట్టబద్ధత’పై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అర్జెంటినా, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా 34దేశాల్లో స్వలింగ సంపర్కుల వివాహాలు చట్టబద్ధం కాగా, 35వ దేశంగా ఎస్టోనియాలో వచ్చే ఏడాది నుంచి చట్టబద్ధత కల్పించనుంది.