హైదరాబాద్-విశాఖపట్నం నడుమ మరో రహదారి
విధాత:హైదరాబాద్-విశాఖపట్నం నడుమ మరో రహదారి మార్గానికి కేంద్ర ప్రభుత్వ అనుమతిచ్చింది.ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరాపల్లి వరకు నాలుగు వరుసల మార్గానికి జాతీయ రహదారి హోదా కల్పిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉత్తర్వులిచ్చింది.ఆ రహదారికి 765 డీజీ నంబరునూ కేటాయించింది.సుమారు 158 కిలోమీటర్ల నిడివిగల ఈ మార్గాన్ని పూర్తిచేస్తే తెలుగు రాష్ట్రాల మధ్య అనుసంధానత పెరుగుతుంది. ఈ రహదారిని హరిత మార్గంగా నిర్మించాలని కేంద్రం ఇంతకు ముందే నిర్ణయించటం తెలిసిందే.తెలంగాణ నుంచి కృష్ణపట్నం, విశాఖపట్నం పోర్టులకు […]

విధాత:హైదరాబాద్-విశాఖపట్నం నడుమ మరో రహదారి మార్గానికి కేంద్ర ప్రభుత్వ అనుమతిచ్చింది.ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరాపల్లి వరకు నాలుగు వరుసల మార్గానికి జాతీయ రహదారి హోదా కల్పిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉత్తర్వులిచ్చింది.ఆ రహదారికి 765 డీజీ నంబరునూ కేటాయించింది.సుమారు 158 కిలోమీటర్ల నిడివిగల ఈ మార్గాన్ని పూర్తిచేస్తే తెలుగు రాష్ట్రాల మధ్య అనుసంధానత పెరుగుతుంది. ఈ రహదారిని హరిత మార్గంగా నిర్మించాలని కేంద్రం ఇంతకు ముందే నిర్ణయించటం తెలిసిందే.తెలంగాణ నుంచి కృష్ణపట్నం, విశాఖపట్నం పోర్టులకు సరకు రవాణాకూ ఈ మార్గం ఉపకరిస్తుంది.