Rajasthan | వృద్ధురాలిని హ‌త్య చేసి.. ఆ మాంసాన్ని తిన్న యువ‌కుడు..

Rajasthan | ఓ వృద్ధురాలిని చంపి ఆమె మాంసాన్ని తిన్న‌ట్లు భావిస్తున్న 24 ఏళ్ల యువ‌కుడిని పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ లోని పాలీ జిల్లాలో ఈ ఘోరం జ‌రిగింది. నిందితుడు సురేంద్ర ఠాకుర్‌కు హైడ్రోఫోబియా ఉంద‌ని తెలియ‌డంతో పోలీసులు అత‌డిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. నీళ్ల‌ను చూడ‌గానే భ‌య‌ప‌డ‌టం హైడ్రోఫోబియా వ్యాధి ల‌క్ష‌ణం. అత‌డిని రేబిస్ సోకిన కుక్క క‌ర‌వ‌డం వ‌ల్ల ఈ వ్యాధి వ‌చ్చి ఉండొచ్చ‌ని వైద్యులు పేర్కొన్నారు. హ‌త్య ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు వెల్ల‌డించిన […]

  • By: krs    news    May 28, 2023 7:38 AM IST
Rajasthan | వృద్ధురాలిని హ‌త్య చేసి.. ఆ మాంసాన్ని తిన్న యువ‌కుడు..

Rajasthan |

ఓ వృద్ధురాలిని చంపి ఆమె మాంసాన్ని తిన్న‌ట్లు భావిస్తున్న 24 ఏళ్ల యువ‌కుడిని పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ లోని పాలీ జిల్లాలో ఈ ఘోరం జ‌రిగింది. నిందితుడు సురేంద్ర ఠాకుర్‌కు హైడ్రోఫోబియా ఉంద‌ని తెలియ‌డంతో పోలీసులు అత‌డిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

నీళ్ల‌ను చూడ‌గానే భ‌య‌ప‌డ‌టం హైడ్రోఫోబియా వ్యాధి ల‌క్ష‌ణం. అత‌డిని రేబిస్ సోకిన కుక్క క‌ర‌వ‌డం వ‌ల్ల ఈ వ్యాధి వ‌చ్చి ఉండొచ్చ‌ని వైద్యులు పేర్కొన్నారు. హ‌త్య ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం..

ఇక్క‌డి సార‌ధానా గ్రామంలో ఉంటున్న శాంతి దేవి (65) ప‌శువులు కాయ‌డానికి శుక్ర‌వారం గ్రామ శివారులోకి వెళ్లింది. అక్క‌డే కాపు కాసిన నిందితుడు రాయితో ఆమె త‌ల‌పై మోది హ‌త్య చేశాడు. అనంత‌రం ఆ మాంసాన్ని కొద్దిగా తిన్న‌ట్లు తెలుస్తోంది.

నిందితుడు మాన‌సిక రుగ్మ‌త‌తో బాధ‌ ప‌డుతున్నాడ‌ని, ఆసుప‌త్రిలోనూ గంద‌ర‌గోళంగా ప్ర‌వ‌ర్తిస్తుండటంతో మంచానికి క‌ట్టేసి చికిత్స అందిస్తున్నార‌ని పోలీసులు తెలిపారు. కేసు న‌మోదు చేసి అన్ని కోణాల్లోనూ ద‌ర్యాప్తు చేస్తామ‌ని వెల్ల‌డించారు.