వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి 10మందికి గాయాలు
విధాత: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 33మంది ప్రయాణికులు ఉన్నారు. ఏపీలో జరిగిన మరో ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందారు. విశాఖలోని షీలానగర్ […]

విధాత: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 33మంది ప్రయాణికులు ఉన్నారు. ఏపీలో జరిగిన మరో ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందారు. విశాఖలోని షీలానగర్ వద్ద ఆగి ఉన్న ట్యాంకర్‌ను పాల వ్యాన్ ఢీకొట్టింది. పాల వ్యాన్ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు.