Rattlesnake Inbreeding | రక్త పింజరలలో అంతర్ప్రజననం సమస్య.. ర్యాటిల్స్నేక్స్ మనుగడకు ముప్పు!
దాదాపు వెయ్యికిపైగా ఈస్టర్న్ మసాసౌగా రాటిల్‌స్నేక్ ఫ్యామిలీ ట్రీస్‌ను పరిశోధకులు ట్రేస్ చేసి.. అధ్యయనం చేశారు. ఈ అధ్యయనానికి అమెరికా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ నిధులు సమకూర్చింది. ఈ అధ్యయనం వివరాలను ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురించారు.

Rattlesnake Inbreeding | రక్త పింజరి! అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. రాటిల్స్నేక్గా పిలిచే ఈ జాతి.. ఒక వింతైన ముప్పును ఎదుర్కొంటున్నదని మిషిగాన్ స్టేట్ యూనివర్సిటీ (MSU) పదిహేనేళ్లుగా సాగించిన ఒక అధ్యయనం వెల్లడించింది. ఈస్టర్న్ మసాసౌగా రాటిల్‌స్నేక్ జాతి మిషిగాన్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీటి ఆవాసాలు విచ్ఛిన్న కావడం వల్ల వీటిలో అంతర్ప్రజననం (రక్త సంబంధీకుల మధ్య సంతానోత్పత్తి) జరుగుతున్నదని, ఇది వాటి మనుగడకే ముప్పును కలిగిస్తున్నదని ఈ అధ్యయనం సంచలన విషయాలు తెలియజేసింది.
రాటిల్‌స్నేక్స్ సాధారణంగా చిత్తడి నేలల్లో ఉంటాయి. అయితే.. రోడ్లు, పొలాలు, భవనాలు పెరిగిపోవడంతో వాటి సహజ ఆవాసాలు కుదించుకుపోతున్నాయి. పైగా అక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని అన్నట్టు ముక్కలు ముక్కలైపోయాయి. సాధారణంగా ఈ పాములు జత కట్టేందుకు తమ వెలుపలి భాగస్వామిని వెతుక్కుంటూ పోతాయి. కానీ.. ఆవాసాలు ముక్కలైపోయిన నేపథ్యంలో ఆ అవకాశం లేకుండా పోయిందని, ఫలితంగా వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని తాజా అధ్యయనం వెల్లడించింది.
దాదాపు వెయ్యికిపైగా ఈస్టర్న్ మసాసౌగా రాటిల్‌స్నేక్ ఫ్యామిలీ ట్రీస్‌ను పరిశోధకులు ట్రేస్ చేసి.. అధ్యయనం చేశారు. ఈ అధ్యయనానికి అమెరికా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ నిధులు సమకూర్చింది. ఈ అధ్యయనం వివరాలను ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురించారు.
ఈ అధ్యయనంలో ఎక్కువగా సంతానోత్పత్తి పాములు జీవించి ఉన్న పిల్లలను ఉత్పత్తి చేసే అవకాశం 13% తక్కువగా ఉందని, వాటి వార్షిక మనుగడ రేటు దాదాపు 12% తక్కువగా ఉందని వెల్లడైంది. వాటి జనాభా పెద్దగానే, స్థిరంగానే ఉన్నప్పటికీ.. అంతర్ప్రజనన ప్రతికూల ప్రభావాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఎంఎస్‌యూ ప్రొఫెసర్ సారా ఫిట్జ్‌పాట్రిక్ అన్నారు. మిడ్ వెస్ట్ ప్రాంతంలోని చిన్న, మరింత విచ్ఛిన్నమైన ఈ పాములు మరిన్ని ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
చిత్తడి నేలల్లో ఎలుకల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో ఈస్టర్న్ మసాసౌగా రాటిల్‌స్నేక్స్ పర్యావరణ హితకారులుగా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ పాముల సంఖ్య తగ్గిపోవడమంటే అవి నివసించే పొలాలు, ఇండ్ల సమీప ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడమేనని పరిశోధకులు అంటున్నారు. మానవ అభివృద్ధి నేపథ్యంలో అవి తమ సమూహంలోని పాములతోనే జతకడుతున్నాయని అధ్యయనం తెలిపింది. పాముల సహజ ఆవాస ప్రాంతాలను కాపాడేందుకు సత్వరం చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ అధ్యయనం వెల్లడిస్తున్నది. రోడ్లు నిర్మించే సమయంలో వాటికింద అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయడం, పాముల ఆవాసాలను పునరుద్ధరించడం, అవసరమైతే ఆరోగ్యకరమైన, భద్రమైన వాతావరణానికి ఆ పాములను రీలొకేట్ చేయడం వంటి చర్యలు తీసుకుంటే.. వాటి సంఖ్య పెరుగుదలకు దోహదం చేస్తుందని అధ్యయనం అభిప్రాయపడింది.
ఇవి కూడా చదవండి..
KBC 17 First Crorepati | కౌన్ బనేగా క్రోర్‌పతి-17: తొలి కోటీశ్వరుడిగా నిలిచిన ఆదిత్య కుమార్
B Sudarshan Reddy on KCR | ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేసీఆర్‌పై రిటైర్డ్ జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Lok Sabha bills 2025 | పోలీసు రాజ్యంగా మార్చే కుట్ర.. రాజకీయ నేతల నేరాల నియంత్రణ బిల్లుపై విపక్షం ఫైర్