(వీడియో) Robots Catch pythons | 20 అడుగుల పొడవున్న కొండచిలువలను అవలీలగా పట్టిస్తున్న ‘కుందేళ్లు’!

20 అడుగుల పొడవుండే బర్మీస్‌ పైథాన్‌లు చిన్న జీవులపై యథేచ్ఛగా దాడి చేస్తూ తినేస్తున్నాయి. ఫ్లారిడాలోని ఎవర్‌గ్లేడ్‌ నేషనల్‌ పార్క్‌లో ఇదొక పెద్ద సమస్యగా మారింది. ఎక్కడ ఏ కొండ చిలువ ఏ ప్రాణిని తింటున్నదో అటవీ ప్రాంతాల్లో పసిగట్టడం అసాధ్యం. అందుకు నిపుణులు తిరుగులేని ప్లాన్‌ వేశారు. కొండ చిలువలను సులభంగా పట్టేస్తున్నారు.

(వీడియో) Robots Catch pythons | 20 అడుగుల పొడవున్న కొండచిలువలను అవలీలగా పట్టిస్తున్న ‘కుందేళ్లు’!

Robots to Catch Burmese pythons | ఫ్లారిడాలోని ఎవర్‌గ్లేడ్స్‌ నేషనల్‌ పార్క్‌ నిర్వాహకులకు పెద్ద సమస్య వచ్చిపడింది. దానిని పరిష్కరించేందుకు వన్యప్రాణి నిపుణులు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. ఎవర్‌గ్లేడ్‌ నేషనల్‌ పార్క్‌లో బర్మీస్‌ పైథాన్‌లు పెద్ద ఎత్తున తోటి ప్రాణులను అమాంతం మింగేస్తున్నాయి. పైథాన్‌లు 20 అడుగుల వరకూ అంటే.. సుమారు ఆరు మీటర్ల పొడవున పెరుగుతాయి. సాధారణంగా నేషనల్‌ పార్కుల్లో కొన్ని రకాల వ్యన్య జీవులు, మృగాలను రక్షిస్తూ ఉంటారు. కొన్ని సమయాల్లో అవి ప్రమాదవశాత్తూ తమ రక్షణ కంచెలు దాటుకుని వెళిపోతుంటాయి. ఇవి పెద్ద మొత్తంలో ఉండటంతో కొండచిలువలు ఆ పార్క్‌లో వీరవిహారం చేస్తున్నాయి. వాటికి సహజ శత్రువులు లేకపోవడంతో వేగంగా వృద్ధి చెందుతున్నాయి. స్థానికంగా ఉండే రాకూన్లు, జింకలు, బాబ్‌కాట్స్‌, ఒపస్సమ్స్‌, మర్ష్‌ కుందేళ్లు, వివిధ రకాల పక్షలను అవి వేటాడి భోం చేస్తున్నాయి. ఈ పాములు విస్తరించిన ప్రాంతాల్లో చిన్న చిన్న క్షీరజాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నదని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీంతో ఈ చిత్తడి నేలల సమతౌల్యం ప్రమాదంలో పడుతున్నది. బర్మీస్‌ పైథాన్‌లను కట్టడి చేసేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వాటిని నియంత్రించలేక పోతున్నారు. ఒక్క దక్షిణ ఫ్లారిడా ప్రాంతంలోనే లక్ష నుంచి మూడు లక్షల వరకూ బర్మీస్‌ కొండచిలువలు ఉన్నట్టు అంచనా.

20 అడుగల వరకూ పెరిగే బర్మీస్‌ పైథాన్‌లు

బర్మీస్‌ పైథాన్‌లు గరిష్ఠంగా 20 అడగుల వరకూ పెరుగుతాయి. అంటే.. దాదాపు ఒక స్కూలు బస్సు ఎంత పొడవు ఉంటుందో అంత అన్నమాట. ఇంతటి భారీ పాములను, అందులోనూ భారీ సంఖ్యలో ఉన్న పాములను పట్టి, ఇతర జీవులను కాపాడటం వన్యప్రాణి నిపుణులకు పెను సమస్యగా తయారైంది. పైగా వాటిని వెతకడం అనేది మరో సంక్లిష్టమైన విషయం. ఈ సమస్యను పరిష్కరించేందుకు, వేగంగా కొండచిలువలను పట్టేసేందుకు సౌత్‌ ఫ్లారిడా వాటర్‌ మేనేజ్‌మెంట్‌ డిస్ట్రిక్ట్‌ అధికారులు వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. అదే.. రోబోటిక్‌ మార్ష్‌ ర్యాబిట్స్‌!

కొండచిలువలను ఆకర్షించే రోబో కుందేళ్లు

2025 వేసవిలో ఇటువంటి 120 రోబో కుందేళ్లను ఎవర్‌గ్లేడ్స్‌ నేషనల్‌ పార్క్‌లో  వివిధ ప్రాంతాల్లో వదిలిపెట్టారు. పాముల కోసం ఎక్కడెక్కడో తిరిగే ఈ రోబోలకు విద్యుత్‌ చార్జింగ్‌ సమస్య లేకుండా సౌర విద్యుత్తుతో పనిచేసేలా రూపొందించారు. వాటిని దూర ప్రాంతాలనుంచి స్విచ్‌ఆన్‌, స్విచ్చాఫ్‌ చేసే సదుపాయం కూడా ఉన్నది. కొండచిలువలకు సహజ ఆహారం అనిపించే ఒక రకమైన వాసన వీటి నుంచి వచ్చే ఏర్పాటు చేశారు. ఇటువంటి ఒక రోబో తయారు చేయడానికి సుమారు నాలుగు వేల డాలర్లు ఖర్చు అయింది. కెమెరా నిఘా ఉండే ప్రాంతాలకు కొండచిలువలను ఇవి ఆకర్షిస్తాయి. తనకు ఆహారం దొరుకుతున్నదనే ఉద్దేశంతో ఆ కొండచిలువలు దాని వెంట వస్తాయి. సీసీటీవీ ఫుటేజ్‌లో వాటిని గమనించగానే అలర్ట్‌ అయ్యే స్నేక్‌ క్యాచర్‌లు అక్కడికి వెంటనే చేరుకుని, సులభంగా వాటిని పట్టేసేవారు. ఈ కొత్త ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. జాతీయ పార్కులు, జూ పార్క్‌లలో పాముల బెడదను నివారించేందుకు ఇదొక అద్భతమైన సాధనంగా నిలుస్తున్నది. రోబోలతోపాటు శిక్షణ పొందిన జాగిలాలు, కొండచిలువలను పట్టడంలో నైపుణం ఉన్న నిష్ణాతులను కూడా ఏర్పాటు చేశారు. అదే సమయంలో వాటి పునరుత్పత్తిని తగ్గించేందుకు జన్యుపరమైన సాంకేతికతపై పరిశోధకులు రిసెర్చ్‌ చేస్తున్నారు. వీటితోపాటు తమ పెంపుడు జంతువులను అటవీ ప్రాంతాల్లో యథేచ్ఛగా వదిలేయకుండా ప్రజల్లో కూడా చైతన్యం తెస్తున్నారు. మొత్తంగా పాములను పూర్తిగా అంతరింపజేయడం సాధ్యం కాదు. పర్యావరణ పరంగా మంచిది కూడా కాదు. అందుకే వన్యప్రాణి నిపుణులు వాటి వృద్ధిని నిరోధించేలా రోబోటిక్‌, ఇతర పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తూ.. అక్కడి స్థానిక అటవీ జీవన వైవిధ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Snakes Love explained | పాముల ప్రేమ నిజమేనా? నాగరాజు, నాగిని అనుబంధంపై మళ్లీ చర్చను రేపిన రెండు పాముల విషాదాంతం!
snakes take revenge: పాములు పగబడతాయా? నాదస్వరానికి నాట్యం చేస్తాయా? నిజమెంత?
Top 5 Cobras | కోబ్రాలందు కొన్ని కోబ్రాలు వేరయా! కాటేస్తే.. కాటికే!
King Cobra viral video | షాకింగ్ వీడియో: అది కింగ్​ కోబ్రా కాదు, నువ్వు మనిషివీ కాదు..వామ్మో..