Mosquitos | దోమలు ఎండాకాలమే కాదు.. వర్షాకాలంలోనూ విజృంబిస్తుంటాయి. దోమలతో విషజ్వరాలు ప్రబలుతుంటాయి. డెంగీ, మలేరియా తదితర విషజ్వరాలు దాడి చేస్తుంటాయి. దోమలు వ్యాప్తి చెందకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా విజృంభిస్తూనే ఉన్నాయి. ఈ దోమల పరిష్కారానికి కోల్‌కతాకు చెందిన సిసిర్ రాడార్ అనే ఇండియన్ స్పేస్ స్టార్టప్ కంపెనీ స్పై శాటిలైట్ టెక్నాలజీని తీసుకువచ్చింది.
Mosquitos | దోమలు ఎండాకాలమే కాదు.. వర్షాకాలంలోనూ విజృంబిస్తుంటాయి. దోమలతో విషజ్వరాలు ప్రబలుతుంటాయి. డెంగీ, మలేరియా తదితర విషజ్వరాలు దాడి చేస్తుంటాయి. దోమలు వ్యాప్తి చెందకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా విజృంభిస్తూనే ఉన్నాయి. ఈ దోమల పరిష్కారానికి కోల్‌కతాకు చెందిన సిసిర్ రాడార్ అనే ఇండియన్ స్పేస్ స్టార్టప్ కంపెనీ స్పై శాటిలైట్ టెక్నాలజీని తీసుకువచ్చింది. దాంతో దోమలను తరిమికొట్టవచ్చని పేర్కొంటుంది.
అత్యాధునిక గూఢచర్య, నిఘా శాటిలైట్ టెక్నాలజీని దోమల జాడను పసిగట్టే టెక్నాలజీగా మార్చేంది. జలాశయాలు, నీటి గుంటల్లో దోమల గుడ్లు ఉన్నాయో లేదో గుర్తించేందుకు హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగించింది. ఈ టెక్నాలజీతో కూడిన కస్టమ్ మేడ్ కెమెరాలను డ్రోన్స్‌ను బిగించింది. ఇందులో భాగంగా మట్టి గ్లాస్లు, ప్లాస్టిక్ గ్లాస్‌లను తీసుకొని వాటిలో ఒకదాంట్లో స్వచ్ఛమైన నీటిని మరో దాంట్లో దోమల లార్వా ఉన్న నీటిని నింపి ఒక చోట దాచి పెట్టింది.
అనంతరం డ్రోన్‌ని ప్రయోగించగా.. అది 15 మీటర్ల ఎత్తు అంటే సుమారు ఐదు అంతస్తుల ఎత్తు నుంచే దోమల గుడ్లతో ఉన్న నీటి గ్లాస్‌ని గుర్తించింది. దోమల వ్యాప్తిని ముందుగానే గుర్తించి అవి ఉన్న చోటే రసాయనాలను పిచికారీ చేసేందుకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని సిసిర్ రేడార్ వ్యవస్థాపకుడు తపన్ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం, దోమల లార్వాను చంపేందుకు జలాశయాలపై పూర్తిగా పురుగుమందులు చల్లుతున్నారని.. దాంతో నీరు విషతుల్యంగా మారి జలచరాలు మనగడ ప్రశ్నార్థకమవుతుందని పేర్కొన్నారు.
కంపెనీ డెవలప్ చేసిన సాంకేతిక పరిజ్ఞానం దోమల సమస్యకు పరిష్కారం చూపుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. తపన్ మిశ్రా ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ మాజీ డైరెక్టర్ పనిచేసిన అనుభవం ఉంది. ఫాదర్ ఆఫ్ ఇండియా స్పై శాటిలైట్స్గా పేరుపొందారు. రాడార్ ఇమేజింగ్‌పై ఆయనకు ఎంతో పట్టుంది. ఆయన కృషితో రిశాట్–1, రిశాట్–2 స్పై శాటిలైట్స్‌ని ఇస్రో అభివృద్ధి చేసింది.