ప్రవళిక హత్య కేసులో మరో ట్వీస్టు

ప్రవళిక హత్య కేసులో మరో ట్వీస్టు

విధాత : గ్రూప్‌ 2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య కేసులో పోలీసులు నిందితుడిగా పేర్కోన్న శివరాజ్‌ రాథోడ్‌ శుక్రవారం నాంపల్లి మేజిస్ట్రేట్‌ కోర్టులో లొంగిపోయాడు. శివరాజ్‌ తరపు న్యాయవాదులు దాఖలు చేసిన సరెండర్‌ పిటిషన్‌ను కోర్టు ఆమోదించగా అతను జడ్జీ ముందు లొంగిపోయాడు. కాగా తన కొడుకును పోలీసులు అన్యాయంగా కేసులో ఇరికించారంటూ అతని తండ్రి నేనావత్‌ కిషన్‌ రాథోడ్‌ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం ఈ కేసులో మరో ఆసక్తికర పరిణామం.