జులై 13 వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం
విధాత:అత్యంత ఘనంగా ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో దేవాదాయ శాఖ, GHMC, వాటర్ వర్క్స్, R & B, హెల్త్, పోలీస్, ఎలెక్ట్రికల్ తదితర శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా అమ్మవారి కళ్యాణాన్ని […]

విధాత:అత్యంత ఘనంగా ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో దేవాదాయ శాఖ, GHMC, వాటర్ వర్క్స్, R & B, హెల్త్, పోలీస్, ఎలెక్ట్రికల్ తదితర శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా అమ్మవారి కళ్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశించారని తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.
జులై 12 వ తేదీన ఎదుర్కోళ్ళు, 13 వ తేదీన అమ్మవారి కళ్యాణం, 14 వ తేదీన రధోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. కోవిడ్ ను దృష్టిలో ఉంచుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి తోపులాటకు గురికాకుండా భారికేడ్లను ఏర్పాటు చేయాలని R & B అధికారులను ఆదేశించారు.
అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రముఖుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఆలయానికి వచ్చే రహదారులు, రధోత్సవం నిర్వహించే రహదారుల మరమత్తులను వెంటనే చేపట్టాలని జోనల్ కమిషనర్ ప్రావిణ్య ను ఆదేశించారు.
మొబైల్ టాయిలెట్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ అధికారులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. మొబైల్ ట్రాన్స్ పార్మర్ లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, రంగురంగుల విద్యుత్ దీపాలతో అమ్మవారి ఆలయాన్ని సర్వాంగసుందరంగా అలంకరించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలలోని అన్ని స్ట్రీట్ లైట్స్ వెలుగుతున్నాయా, లేదా ఒకసారి చెక్ చేసి అవసరమైన చోట్ల లైట్స్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. అమ్మవారి కళ్యాణ ఉత్సవాల ప్రారంభం నుండి ముగిసే వరకు నీటి సరఫరా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. మూడు రోజులపాటు స్వచ్చందంగా భక్తులకు సేవలందించే వాలంటీర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులను బార్ కోడింగ్ తో పంపిణీ చేయాలని ఆదేశించారు. మూడు రోజుల పాటు ఆలయ పరిసరాలలో భక్తుల రాకపోకలు ఉంటాయని, ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టి ప్రజలు, వాహనదారులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని ట్రాఫిక్ పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. R & B అధికారుల సహకారంతో ట్రాఫిక్ డైవర్షన్ కోసం అవసరమైన రహదారులలో భారికేడ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. భక్తులకు వైద్య సేవలను అందించేందుకు ఆలయ పరిసరాలలో మూడు వైద్య శిభిరాలను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ ను ఆదేశించారు.
Readmore:తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం : సీఎం కేసీఆర్