Bandi Sanjay : బసరత్ ఖాన్ కారుకు..కేటీఆర్ కు లింకులపై దర్యాప్తు చేయాలి
బసరత్ ఖాన్ లగ్జరీ కారు స్కామ్‌లో కేటీఆర్ లింకులపై దర్యాప్తు చేయాలని బండి సంజయ్ డిమాండ్; ల్యాండ్ క్రూయిజర్ కొనుగోలు వివరాలపై ప్రశ్నలు.

విధాత: కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. లగ్జరీ కార్ల స్కామ్ కేసులో నిందితుడు బసరత్ ఖాన్ పై ఈడీ కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించడాన్ని బండి సంజయ్ స్వాగతించారు. లగ్జరీ కార్ల స్కామ్ కేసులో అహ్మదాబాద్ డీఆర్ఐ అరెస్ట్ చేసిన..ఈడీ కేసులో ఉన్న నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూయిజర్ కారులో ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నాడు? అని బండి ప్రశ్నించారు.
ల్యాండ్ క్రూయిజర్ కారుని కేటీఆర్ మార్కెట్ ప్రైస్ కి కొన్నారా? అండర్ వాల్యూడ్ ధరకు కొన్నారా? కేసీఆర్ ఫ్యామిలీతో లింక్ ఉన్న కంపెనీల వాళ్ల పేరును కారు ఎందుకు రిజిస్టర్ అయ్యిందంటూ ? ప్రశ్నలు సంధించారు. స్మగుల్డ్ చేసిన కార్లలో కారు పార్టీ నడుస్తోందా? నిజానిజాలు బయటకి రావాలని.. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.