కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్‌.. కిషన్‌రెడ్డిలు

కేంద్ర మంత్రులుగా తెలంగాణకు చెందిన జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు గురువారం తమ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఢిల్లీలోని శాస్త్రీభవన్‌లోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్‌.. కిషన్‌రెడ్డిలు

ప్రముఖుల అభినందనలు

విధాత, హైదరాబాద్ : కేంద్ర మంత్రులుగా తెలంగాణకు చెందిన జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు గురువారం తమ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఢిల్లీలోని శాస్త్రీభవన్‌లోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తన సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి,వేద ఆశీర్వచనం, పార్టీ ముఖ్యులు, అభినందనల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు కిషన్‌రెడ్డి తెలంగాణ భవన్ లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కుటుంబ సమేతంగా తెలంగాణ భవన్ లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ భవన్ బయట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, పార్టీ నేతలు హాజరయ్యారు. మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోష్ కిషన్ రెడ్డి ఛాంబర్ కు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో బొగ్గు గనుల నిర్వాహణ పారదర్శకంగా బొగ్గు గనుల నిర్వాహణ చేయడం ద్వారా వ్యవసాయ, పారిశ్రామిక, బటీ రంగాల్లో విద్యుత్ కోతలు నివారించడంలో విజయం సాధించారన్నారు. విద్యుత్ కోతలు నివారంచడంలో బొగ్గు, గనుల శాఖ కీలకమైనదని, రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ కోతలు లేని భారత్ ను నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

ప్రస్తుతం విదేశాల నుంచి కొంత మేర బొగ్గును దిగుమతి చేసుకుంటున్నామని, రాబోయే రోజుల్లో దేశానికి సరిపడా బొగ్గును మనమే ఉత్పత్తి చేసుకోవాల్సి ఉందన్నారు. మినరల్స్ ను ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత దేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యస్థగా తీర్చిదిద్దేందుకు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మోడీ నాయకత్వంలో అధికారులతో సమన్వయంతో పనిచేసి దేశ ప్రజలు ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు.

అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ గురువారం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ వేదాశీర్వాచనల మధ్య సాదాసీదాగా బండి బాధ్యతలు స్వీకరించారు. సహచర మంత్రి నిత్యానంద రాయ్ ఆయనకు బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు తన అధికారిక నివాసంలో బండి సంజయ్ ను కలిసి తెలంగాణ నుండి ఢిల్లీకి వెళ్లిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.