బైక్‌ను ఢీ కొట్టిన డీసీఎం.. పాల ప్యాకెట్ కోసం వెళ్లి తండ్రి దుర్మరణం

రెండేళ్ల కుమారుడితో కలిసి పాల ప్యాకెట్, టిఫిన్‌ తీసుకొచ్చేందుకు ఉదయాన్నే బైక్‌పై వెళ్లిన ఓ తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.

బైక్‌ను ఢీ కొట్టిన డీసీఎం.. పాల ప్యాకెట్ కోసం వెళ్లి తండ్రి దుర్మరణం

విధాత: రెండేళ్ల కుమారుడితో కలిసి పాల ప్యాకెట్, టిఫిన్‌ తీసుకొచ్చేందుకు ఉదయాన్నే బైక్‌పై వెళ్లిన ఓ తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఏపీకి చెందిన కొవ్వూరు జిల్లా అతివధులు గ్రామానికి చెందిన శెట్టి కనక ప్రసాద్ పది రోజుల క్రితమే జీవనోపాధి కోసం అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఇనాంగూడలో కుటుంబంతో వచ్చి నివాసం ఉంటున్నాడు. కనక ప్రసాద్‌ గురువారం ఉదయం 7గంటలకు రెండేళ్ల కొడుకుతో కలిసి పాల ప్యాకెట్, టిఫిన్‌ తెచ్చేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు.

తిరిగి వచ్చే క్రమంలో ఇనాం కూడా కమాన్ వద్ద యూటర్న్ తీసుకుంటూ ఉండగా విజయవాడ నుంచి ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం ప్రసాద్ బైక్‌ను బలంగా ఢీ కొట్టడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు శివకుమార్‌కు గాయాలయ్యాయి. గాయాలతోనే కుమారుడు తండ్రి మృతదేహం వద్ద ఏడుస్తూ కనిపించడం అందరిని కలచివేసింది.

సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్ మెట్‌ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కనక ప్రసాద్ మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శివ ప్రసాద్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కనక ప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.