రాజకీయ ప్రయాణం.. సంఘర్షణనే ఇచ్చింది: విజయశాంతి

రాజకీయ ప్రయాణం.. సంఘర్షణనే ఇచ్చింది: విజయశాంతి
  • కేసీఆర్, బీఆరెస్ అరాచకాలపైనే పోరాటం
  • మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి ఆసక్తికర ట్వీట్


విధాత, హైదరాబాద్: సినీ రంగం, తెలంగాణ ఉద్యమం, రాజకీయాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి తాజాగా తన రాజకీయ జీవితంపై ఎమోషనల్ గా స్పందించారు. ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆమె చేసిన ఆసక్తికర ట్వీట్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ‘25 సంవత్సరాల నా రాజకీయ ప్రయాణం, అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణ మాత్రమే నాకు ఇస్తూ వచ్చింది.

ఏ పదవి ఏనాడు కోరుకోకున్న.. ఇప్పటికీ అనుకోకున్న కూడా… అయితే ప్రస్తుతం ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం. మన పోరాటం నాడు దశాబ్ధాల ముందు తెలంగాణ ఉద్యమ బాట నడిచినప్పుడు, మొత్తం అందరు తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప, ఇయ్యాల్టి బీఆర్ఎస్ కు వ్యతిరేకం అవుతాం అని కాదు… నా పోరాటం నేడు కేసీఆర్ గారి కుటుంబ దోపిడీ, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వం పై తప్ప , నాతో కలిసి తెలంగాణా ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదు.’ అంటూ పోస్ట్ చేశారు.


రాజకీయపరంగా విభేదించినప్పటీకి, అన్ని పార్టీల మొత్తం తెలంగాణ బిడ్డలు సంతోషంగా, సగౌరవంగా ఎన్నటికే ఉండాలనీ మనఃపూర్వకముగా కోరుకోవటం మీ రాములమ్మ ఒకే ఒక్క ఉద్దేశ్యం… ఎప్పటికీ… అంటూ తన ట్వీట్ ను ముగించారు. కాగా సీఎం కేసీఆర్ పై కామారెడ్డి నియోజకవర్గం నుంచి విజయశాంతి బీజేపీ అభ్యర్థిగా పోటీపడుతుందని ఇటీవల రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చింది. అయితే పార్టీ అధిష్టానం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.