బీఆరెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ యూటర్న్‌

రాజేంద్రనగర్ బీఆరెస్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరికపై యూటర్న్ తీసుకున్నారు. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తాను శనివారం కాంగ్రెస్‌లో చేరుతానని చెప్పిన ప్రకాశ్‌గౌడ్ పార్టీ మార్పు విషయమై కేడర్‌తో సమావేశమయ్యారు

  • Publish Date - April 20, 2024 / 07:28 PM IST

పార్టీ మార్పుపై కేడర్‌లో వ్యతిరేకత

విధాత, హైదరాబాద్‌ : రాజేంద్రనగర్ బీఆరెస్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరికపై యూటర్న్ తీసుకున్నారు. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తాను శనివారం కాంగ్రెస్‌లో చేరుతానని చెప్పిన ప్రకాశ్‌గౌడ్ పార్టీ మార్పు విషయమై కేడర్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ మార్పుపై స్థానిక నాయకులు, కార్యకర్తలు తమ వ్యతిరేకతను వెలిబుచ్చారు. పార్టీ మారితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పారు. మీరు వెళితే వెళ్లండి మేం రాలేమని మరికొందరు కుండబద్దలు కొట్టారు. దీంతో ఆలోచనలో పడ్డా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కేడర్‌ను బుజ్జగించి కొంచం ఆగి అడుగెద్దామని సర్ధిచెప్పారు. మీ పదవులకు నాది గ్యారంటీ అని మీ దయతోనే గెలిచానని అనునయించారు. అనంతరం తనను కలిసిన మీడియాతో మాట్లాడిన ప్రకాశ్‌గౌడ్ తాను పార్టీ మారడం లేదంటూ కాంగ్రెస్‌లో చేరికపై యూటర్న్ తీసుకున్నారు. కేడర్‌ను ఒప్పించాకే పార్టీ మారాలన్న నిర్ణయంతో ఆయన ప్రస్తుతానికి కాంగ్రెస్‌లో చేరికను వాయిదా వేసుకున్నారని ప్రచారం వినిపిస్తుంది.

Latest News