Harish Rao | ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా బిఆర్ఎస్కు వంద సీట్లు
Harish Rao | ఇప్పటికప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్‌కు వంద సీట్లు వస్తాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ భవన్‌లో బుధవారం మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కేసీఆర్(KCR) పెట్టిన భిక్ష అని , కేసీఆర్ లేకుంటే తెలంగాణే లేదని, రేవంత్ సీఎం అయ్యేవాడు కాదన్నారు. కేసీఆర్‌కు, రేవంత్‌కు నక్కకు–నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్న హరీశ్‌రావు, కాంగ్రెస్ సీనియర్లు తన కుర్చీని ఎక్కడ గుంజుకుంటారోననే భయంలో రేవంత్ ఉన్నాడన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్‌ఎస్(BRS) మాత్రమేనని, ముఖ్యమంత్రి కేసీఆరేనని స్పష్టం చేశారు. దేశంలో మూడుసార్లు ఓడిన కాంగ్రెస్ ఖతం అయిపోయిందా? అంటూ ప్రశ్నించారు. సాకులు చూపుతూ రుణమాఫీ చేయకుండా రేవంత్ రైతులను మోసం చేశారని విమర్శించారు.
ఆరు మంత్రి పదవులు నింపేందుకే రేవంత్ హైకమాండ్ వద్ద నానా అగచాట్లూ పడుతున్నాడని, విద్య, మైనారిటీ, పోలీసు శాఖలకు మంత్రులు లేరు, శాసనసభలో డిప్యూటీ స్పీకర్, చీఫ్‌విప్ లేరన్న హరీశ్, ఇదీ రేవంత్ దీన పరిస్థితి అని ఎద్దేవా చేసారు. రేవంత్(Revanth Reddy) స్పీచ్ వస్తూంటే, ఎక్కడ ఆ దుర్భాషలు విని పిల్లలు చెడిపోతారోనని, ఇండ్లల్లో తల్లిద్రండులు టీవీలను బంద్ చేస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ, ఇలా దిగజారి మాట్లాడం సిగ్గుచేటని, అలాగే ఏమాత్రం అవగాహన, సమగ్ర సమాచారం లేకుండా మాట్లాడితే ప్రజల్లో చులకన అవుతానన్న జ్ఞానం కూడా లేకపోయిందని విమర్శించారు.