KTR | రాఖీ పౌర్ణమి రోజున చెల్లి జైలులో.. కవిత ఫోటోలతో కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్‌

అన్నా చెల్లెలి అనుబంధానికి ప్రతీకయైన రాఖీ పౌర్ణమి వేడుకలు దేశ వ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోదరి బీఆరెస్ ఎమ్మెల్యే కవితను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ట్విటర్‌ ఎక్స్ వేదికగా కవిత ఫోటోలతో ఎమోషనల్ ట్వీట్ చేశారు.

KTR | రాఖీ పౌర్ణమి రోజున చెల్లి జైలులో.. కవిత ఫోటోలతో కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్‌

KTR | అన్నా చెల్లెలి అనుబంధానికి ప్రతీకయైన రాఖీ పౌర్ణమి (Rakhi Purnima) వేడుకలు దేశ వ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోదరి బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ట్విటర్‌ ఎక్స్ వేదికగా కవిత ఫోటోలతో ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘ఈ రోజు నువ్వు రాఖీ కట్ట లేకపోవచ్చు.. కానీ నీకు ఏ కష్టమొచ్చినా నేను అండగా ఉంటా’ అని ట్వీట్ చేశారు. గతంలో సోదరి కవిత తనకు రాఖీ కట్టిన ఫోటోలు షేర్ చేశారు. కేటీఆర్ పెట్టిన ఈ ఎమోషనల్ ట్వీట్ వైరల్‌గా మారింది. కేటీఆర్, కవితల బంధావ్యాన్ని గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు వారి పరిస్థితిపై సానుభూతి తెలుపుతున్నారు. కేటీఆర్ అభిమానులు, బీఆరెస్ (BRS) శ్రేణులు మేమంతా మీ వెంటే ఉన్నామని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా కేటీఆర్ చెల్లెలు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె తీహార్ జైల్లో (Tihar Jail)ఉన్న సంగతి తెలిసిందే. అనంతం ఇదే కేసులో సీబీఐ (CBI) సైతం ఏప్రిల్ 24న జైలులోనే అరెస్టు చేసింది. అప్పటి నుంచి కవిత బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నప్పటికి ఇప్పటిదాకా ఏవి ఫలించలేదు. సుప్రీంకోర్టు (Supreme Court)లో తాజాగా కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కీలక విచారణ ఈ నెల 20వ తేదీన జరుగనుంది. ఇటీవల ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసొడియా సహా పలువురికి ఈ కేసులో బెయిల్ లభించిన నేఫథ్యంలో ఈ దఫా కవితకు బెయిల్ వస్తుందన్న ధీమా బీఆరెస్ నాయకత్వం వ్యక్తం చేస్తుంది.