KTR | కాంగ్రెస్ పాలనలోనే దిగజారిన మహిళా భద్రత: కేటీఆర్

కాంగ్రెస్ పాలనలోనే మహిళల భద్రత దిగజారిపోయిందని, పెరిగిపోతున్న అత్యాచారాలు, హత్యల నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

KTR | కాంగ్రెస్ పాలనలోనే దిగజారిన మహిళా భద్రత: కేటీఆర్

KTR | కాంగ్రెస్ పాలనలోనే మహిళల భద్రత దిగజారిపోయిందని, పెరిగిపోతున్న అత్యాచారాలు, హత్యల నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని బీఆరెస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సోమవారం మీడియా చిట్ చాట్‌లో ఆయన మాట్లాడారు. మంత్రి సీతక్క (Minister Seethakka) బీఆరెస్ పాలనలో మహిళలపై జరిగిన నేరాలను కమిషన్‌కు అందిస్తామన్న వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తొమ్మిదేండ్ల కాలంలో మొత్తం 1,57,610 కేసులు నమోదు అయ్యాయని, మహిళా కమిషన్‌ను తాము కూడా కలుస్తామని సీతక్క తెలిపారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ఎనిమిదినెలల తర్వాతయినా సీతక్కకు మహిళలపై అఘాయిత్యాలు గుర్తుకు రావడం మంచిదని ఎద్దేవా చేశారు.

మహిళలపై అఘాయిత్యాలు జరిగితే ప్రభుత్వం, మహిళా కమీషన్ (Women’s Commission) వెంటనే స్పందించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు దున్నపోతు మీద వాన పడినట్లుగా ఉందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చెంచు మహిళపైన, షాద్ నగర్‌లో ఒక దళిత మహిళపై అఘాయిత్యం జరిగితే మా నాయకులు వెళ్ళే వరకు ప్రభుత్వం పట్టించుకోలేదన్నరు. మేము గొడవ చేస్తే పోలీసు అధికారిని సస్పెండ్ చేశారని కేటీఆర్ గుర్తు చేశారు.. మహిళలు, పిల్లలు, ప్రజలు శాంతియుతంగా బ్రతికే విధంగా మహిళా కమీషన్, ప్రభుత్వం చూసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో హత్యలు జరుగుతుంటే ఆపే తెలివి లేదని, అఘాయిత్యాలు పెరుగుతుంటే పట్టించుకునే నాధుడు లేడని, రాష్ట్రానికి హోంమంత్రి దిక్కు లేడని, నేను పొరపాటున నోరుజారి ఒక మాట అంటే క్షమాపణ చెప్పానన్నారు.

ప్రపంచంలో ఇంతకంటే పెద్ద సమస్య లేనట్లు దాన్నే సమస్య చేస్తున్నారని విమర్శంచారు. దానికి రాజకీయ రంగు పులుముతున్నారని, మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఘాయిత్యాలపై విచారణ జరపండని కోరారు. బీఆరెస్ హయంలో శాంతి భద్రతలు ఎలా ఉండనో ఎప్పుడు ఎలా ఉన్నాయో కమిషన్ వేయండని డిమాండ్ చేశారు. షీ టీమ్స్ (She Teams) పెట్టింది ఎవరు..?. భరోసా కేంద్రాలు పెట్టింది ఎవరు..?. ఉమెన్స్ సేఫ్టీ వింగ్ స్టార్ట్ చేసింది ఎవరని ప్రశ్నించారు. దిశలాంటి ఘటనలో తెలంగాణ లాంటి న్యాయం చేయాలని కోల్‌కతా ఘటనలో కోరుతున్నారని, దట్ ఈజ్ కేసిఆర్, మీకు మాట్లాడే అర్హత ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం లోపాలను ప్రస్తావించిన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలపై ఈనెల 24న మహిళా కమిషన్ ముందు తప్పకుండా హాజరవుతానని, కాంగ్రెస్ ఎనిమిదినెలల పాలనలో మహిళలపై జరిగిన నేరాల వివరాలను అందిస్తానని స్పష్టం చేశారు.