KTR | నా మాటలు గుర్తు పెట్టుకో సీఎం రేవంత్‌రెడ్డి: బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామన్న బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌డ్డి మండిపడటంపై కేటీఆర్ ట్వీటర్ వేదికగా స్పందించారు

KTR | నా మాటలు గుర్తు పెట్టుకో సీఎం రేవంత్‌రెడ్డి: బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మేం వచ్చాక సచివాలయం పరిసరాల్లోని చెత్త చెదారాన్ని తొలగిస్తాం

KTR | సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం (Rajiv Gandhi Statue) తొలగిస్తామన్న బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌డ్డి (CM Revanth Reddy) మండిపడటంపై కేటీఆర్ ట్వీటర్ వేదికగా స్పందించారు. ” నా మాటలు గుర్తు పెట్టుకో సీఎం రేవంత్ రెడ్డి.. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లోని చెత్త చెత్త చెదారాన్ని.. తాము మళ్లీ కార్యాలయంలోకి వచ్చిన రోజునే తొలగిస్తాం.” అని ట్వీట్ చేశారు.

అలాగే నీలాంటి ఢిల్లీ గులాం తెలంగాణ (Telangana ) ఆత్మగౌరవాన్ని, గర్వాన్ని అర్థం చేసుకోగలడని ఆశించలేం, బడి పిల్లల ముందు నీచమైన పదజాలాన్ని ఉపయోగించడం మీ నిజమైన ఆలోచన చూపుతుంది. మీరు ఈ మానసిక వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని కేటీఆర్‌ తన ట్వీట్‌లో పేర్కోన్నారు.