CM CUP | యువతలో క్రీడా స్ఫూర్తి కోసమే.. సీఎం కప్: మంత్రి జగదీష్ రెడ్డి

CM CUP | విధాత: యువతలో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పేరుతో టోర్నమెంట్లు నిర్వహిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ మేకల అభినవ్ స్టేడియంలో సీఎం కప్ జిల్లా స్థాయి టోర్నమెంట్ ను ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఒకవైపు వేయికి పైగా గురుకులాల ఏర్పాటుచేసి విద్యార్థులకు ఉన్నతమైన చదువులు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటూనే.. ఇంకోవైపు విద్యార్థులను క్రీడల్లో […]

CM CUP | యువతలో క్రీడా స్ఫూర్తి కోసమే.. సీఎం కప్: మంత్రి జగదీష్ రెడ్డి

CM CUP |

విధాత: యువతలో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పేరుతో టోర్నమెంట్లు నిర్వహిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ మేకల అభినవ్ స్టేడియంలో సీఎం కప్ జిల్లా స్థాయి టోర్నమెంట్ ను ప్రారంభించి మాట్లాడారు.

సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఒకవైపు వేయికి పైగా గురుకులాల ఏర్పాటుచేసి విద్యార్థులకు ఉన్నతమైన చదువులు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటూనే.. ఇంకోవైపు విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తుందన్నారు.

సీఎం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తయారు చేస్తుందన్నారు. విద్యార్థులు ఓటమి నుంచి గెలుపుకు పునాది వేసుకోవాలని, క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు గెలుపు ఓటమిల మధ్య ఒత్తిడిలను ఎదుర్కోవడంలో తగిన నైపుణ్యాన్ని అందిస్తాయన్నారు.

విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో ఆటలు అంతే ముఖ్యమని, చదువుతోపాటు ఆటల్లో కూడా రాణించేందుకు కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, భాస్కర్ రావు. మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి,
గ్రంధాలయ చైర్మన్ మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.