ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్‌రెడ్డికి బీఫామ్‌ అందించిన సీఎం రేవంత్‌రెడ్డి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి పార్టీ బీ-ఫామ్‌ను పీసీసీ అధ్యక్షులు, సీఎం రేవంత్ రెడ్డి అందించారు

ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్‌రెడ్డికి బీఫామ్‌ అందించిన సీఎం రేవంత్‌రెడ్డి

విధాత, హైదరాబాద్‌ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి పార్టీ బీ-ఫామ్‌ను పీసీసీ అధ్యక్షులు, సీఎం రేవంత్ రెడ్డి అందించారు. అటు బీఆరెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగర్‌కుంట నవీన్‌కుమార్‌ రెడ్డికి సైతం నిన్ననే బీఆరెస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ బీ ఫామ్‌ అందజేశారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు ఈ నెల 4న నోటిఫికేషన్‌ వెలువడగా.. ఈ నెల 28న పోలింగ్‌ జరుగనున్నది. అంతకుముందు మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి బీఆరెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో, ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.