మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం బ్యారేజీ కుంగుబాటును పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంతులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి కుంగిన పిల్లర్లను, గేట్లను పరిశీలించారు

  • నదిలోకి వెళ్లి కుంగిన పిల్లర్ల పరిశీలన
  • పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు హాజరు

విధాత : మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం బ్యారేజీ కుంగుబాటును పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంతులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి కుంగిన పిల్లర్లను, గేట్లను పరిశీలించారు. ముందుగా డ్యాంపై నుంచి బ్యారెజీని పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి బృందం అనంతరం నదిలోకి వెళ్లి కుంగిన డ్యాం 21వ పిల్లర్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడ విజిలెన్స్ అధికారులు ప్రాజెక్టులోని లోపాలు, అవినీతి జరిగిన తీరుతెన్నులను వివరిస్తూ రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు హాజరయ్యారు.

మేడిగడ్డ డిజైన్‌, నిర్మాణంలో లోపాలు, నాణ్యత ప్రమాణాలు, కుంగుబాటుకు దారితీసిన పరిస్థితులపై ఇటీవల విచారణ జరిపిన విజిలెన్స్ బృందం సిద్ధం చేసిన నివేదిక మేరకు ఇవ్వనున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆసక్తికరంగా మారింది. మేడిగడ్డ నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని, కాళేశ్వరం ప్రాజెక్టు అంతా ఇదే పద్ధతిలో అనేక లోపాలు, అవకతవకలతో పనులు జరిగాయని విజిలెన్స్ విచారణ బృందం గుర్తించింది. అటు కాగ్ సైతం గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని అక్రమాలను వెల్లడించింది. సీఎం రేవంత్‌రెడ్డి బృందం మేడిగడ్డ బ్యారెజీ సందర్శన, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.

Somu

Somu

Next Story