నల్లగొండ: ముగిసిన కానిస్టేబుల్, SI దేహదారుఢ్య‌ పరీక్షలు

12,124 అభ్యర్థులు ఉత్తీర్ణత: ఎస్పీ రెమా రాజేశ్వరి విధాత: నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో డిసెంబర్ 8 నుంచి జనవరి 4 వరకు నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్, ఎస్ ఐ ఉద్యోగ అభ్యర్థులకు నిర్వహించిన దేహదారుఢ్య‌ పరీక్షలు బుధవారం ముగిశాయి. మొత్తం 26,433 మంది అభ్యర్థులకు గాను 23,524 మంది అభ్యర్థులు హాజరుకాగా, 12,124 అభ్యర్థులు (ఫిజికల్ టెస్ట్లు) దేహదారుఢ్య పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారని ఎస్పీ రెమా రాజశ్వరి తెలిపారు. వీరిలో పురుష అభ్యర్థులు […]

నల్లగొండ: ముగిసిన కానిస్టేబుల్, SI దేహదారుఢ్య‌ పరీక్షలు
  • 12,124 అభ్యర్థులు ఉత్తీర్ణత: ఎస్పీ రెమా రాజేశ్వరి

విధాత: నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో డిసెంబర్ 8 నుంచి జనవరి 4 వరకు నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్, ఎస్ ఐ ఉద్యోగ అభ్యర్థులకు నిర్వహించిన దేహదారుఢ్య‌ పరీక్షలు బుధవారం ముగిశాయి.

మొత్తం 26,433 మంది అభ్యర్థులకు గాను 23,524 మంది అభ్యర్థులు హాజరుకాగా, 12,124 అభ్యర్థులు (ఫిజికల్ టెస్ట్లు) దేహదారుఢ్య పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారని ఎస్పీ రెమా రాజశ్వరి తెలిపారు.

వీరిలో పురుష అభ్యర్థులు 19,260 మంది హాజరుకాగా, 9,235 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లుగా తెలిపారు. మహిళా అభ్యర్థులు 4,264 మంది హాజరుకాగా, 2,889 మంది అభ్యర్థులు అర్హత సాధించారన్నారు.

ప్రత్యేక అధికారి, చీప్ సూపరిండెంట్ డాక్టర్ పి. శబరిష్, నోడల్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ కె.ఆర్.కె. ప్రసాదరావు ల పర్యవేక్షణలో రాష్ట్ర పోలీసు నియామక మండలి సూచించిన నియమాల ప్రకారం ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పకడ్బందీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిర్వహించినట్లుగా తెలిపారు.

పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో , పారదర్శకంగా సీసీ కెమెరాల నిఘాలో, జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, సాంకేతిక నిపుల సహకారంతో ప్రశాంతంగా దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేయడం జరిగిందన్నారు.

ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణ కార్యక్రమంలో ఎస్బీ డియస్పి మొగిలయ్య, నల్లగొండ డిఎస్పీ నరసింహా రెడ్డి, మిర్యాల గూడ డిఎస్పీ వెంకటేశ్వర రావు, డి.సి.ఆర్.బి డిఎస్పీ రమేష్, ఏ.ఆర్ డిఎస్పీ సురేష్, సూర్యాపేట డిఎస్పీ రవి, ఏఒ మంజు భార్గవి, సిఐ లు, ఆర్.ఐ లు, యస్ఐలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది, ఐటీ కోర్ టీమ్, టెక్నికల్ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, 108 అంబులెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారన్నారు.