సీఎం కేసీఆర్‌పై హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్
సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ఆపాలని కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది

విధాత : సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ఆపాలని కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాంగ్రెస్ పార్టీపైన దుష్ప్రచారం చేస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పిటిషన్‌లో ఆరోపించారు. ఎన్‌ఎస్‌యుఐ నేత బల్మూరు వెంకట్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగాలు రెచ్చగొట్టే రీతిలో సాగుతున్నాయని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని, అందుకే కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ఆపివేయించాలని హైకోర్టును ఆశ్రయించామని పిటిషనర్ పేర్కోన్నారు.