హామీలు అమలు చేయాలి..లేదంటే తిరుగుబాటు తప్పదు

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పైనే దృష్టి పెట్టిందని, మ్యానిఫెస్టోలో 412 హామీలు ఇచ్చిందని వాటన్నింటిని నెరవేర్చాలని బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు

హామీలు అమలు చేయాలి..లేదంటే తిరుగుబాటు తప్పదు
  • బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి

విధాత : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పైనే దృష్టి పెట్టిందని, మ్యానిఫెస్టోలో 412 హామీలు ఇచ్చిందని వాటన్నింటిని నెరవేర్చాలని బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ నుంచి ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని చెబుతూ హామీలను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారన్నారు. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాదర్భార్‌లో సీఎం రోజు వినతి పత్రాలు తీసుకుంటానని చెప్పి ఒక్క రోజుకే సీఎం పరిమితమయ్యారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దూకుడు తగ్గించుకోవాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్ వల్లే రాలేదని బీజేపీ మద్దతు కూడా ఇస్తేనే వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి అదృష్టవంతుడని, ఎన్నికల్లో ఒక స్థానంలో ఓడినా ఆయన సీఎం అయ్యారన్నారు.