Danam Nagender | శాసనసభలో దానం నాగేందర్​ బూతుపురాణం

ఖైరతాబాద్​ ఎమ్మేల్యే దానం నాగేందర్​ తెలంగాణ శాసనసభలో రాయలేని భాషలో ప్రతిపక్ష సభ్యులను బూతులు తిట్టారు. హైదరాబాద్​ అభివృద్ధిపై జరుగుతున్న చర్చలో భాగంగా మైక్​ సంపాదించిన దానం ప్రతిపక్ష బిఆర్​ఎస్​ సభ్యులపై తన అసలైన శైలిలో తిట్లతో ఎగబడ్డారు.

Danam Nagender | శాసనసభలో దానం నాగేందర్​ బూతుపురాణం

బిఆర్​ఎస్​ నుండి గెలిచిన ఖైరతాబాద్​(Khairatabad) శాసనసభ్యుడు దానం నాగేందర్(Danam Nagendar)​ నిండు సభలో బూతులు (Abuses BRS MLAs)అందుకున్నారు. జాబ్​ క్యాలెండర్​పై మాట్లాడేందుకు అనుమతి కోరుతూ బిఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు స్పీకర్​ వద్ద ఆందోళన చేస్తున్న సమయాన, హైదరాబాద్​పై లఘచర్చలో పాల్గొనే అవకాశం వచ్చిన దానం, మైక్​లోనే వారిని దారుణమైన బూతులు తిట్టారు. ఆయన ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నారో స్పష్టం చేయాలని స్పీకర్​ను పట్టుబట్టిన బిఆర్​ఎస్​ శాసనసభ్యులనుద్దేశించి, “నీయమ్మ.., నా కొడకల్లారా.., తోలు తీస్తా..” అని ఇంకా రాయలేని భాషలో తిట్టారు.

కేటీఆర్(KTR)​, పల్లా, కౌశిక్​రెడ్డి, సబిత తదితరులను నాగేందర్​ బండబూతులు తిడుతూ ఊగిపోయారు. ఇదంతా జరుగుతున్నా, స్పీకర్​ సుతిమెత్తగా మందలిస్తున్నా, సభానాయకుడు సిఎం సమక్షంలోనే(In presence of CM) ఇదంతా జరిగింది. కాగా, కొంతమంది కాంగ్రెస్​ శాసనసభ్యులు దానంగా అండగా నిలబడటం గమనార్హం. నాగేందర్​ దురహంకార వ్యాఖ్యలపై మాట్లాడేందుకు కూడా బిఆర్​ఎస్​ సభ్యులకు స్పీకర్​(Speaker) అవకాశం ఇవ్వకపోవడంతో సిగ్గు..సిగ్గు అనుకుంటూ బిఆర్​ఎస్​ వాకౌట్​(Walkout) చేసింది. ఇంత తతంగం జరుగుతున్న సభలోనే ఉన్న ముఖ్యమంత్రి నోరు మెదపకపోవడం విశేషం.

దానం నాగేందర్​కు ఇదేం కొత్త కాదు. గతంలోనూ ఆయన ఇలా ప్రవర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ఉస్మానియా విద్యార్థులపై తన ఇంటి వద్ద లాఠీలతో దాడి(Lotty charge on Osmania Stundents) చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బిఆర్​ఎస్​ పార్టీపై గెలిచి, కాంగ్రెస్​లో చేరి ఎంపీగా పోటీ చేసిన దానంపై అనర్హత వేటు వేయాలని బిఆర్​ఎస్​ ఇటు స్పీకర్​కు, అటు హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.