వైఎస్‌ ను దొంగ అనకుండా దొర అంటారా?..మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శలు చేశారు. మావోయిస్టుల పేరుతో ఎంతో మందిని వైఎస్‌ బలి తీసుకున్నారన్నారు. ‘‘తెలంగాణలోని భూములు, ఆస్తులను వైఎస్‌ దోచుకున్నారు. అక్రమ కేసులతో అమాయకులను వేధించారు. ఉమ్మడి ఏపీలో గ్రూప్‌-1 పోస్టుల నియామకాల్లో అక్రమాలు జరిగాయి. దొంగను దొంగ అనకుండా దొర అంటారా? ఏపీతో ఎంత మంచిగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నా.. జగన్ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో బలహీనవర్గాలను జగన్‌ అణగదొక్కుతున్నారు’’అని శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు.